మోనాలిసా క్రేజ్ మామూలుగా లేదు... షాప్ ఓపెనింగ్ వీడియో వైరల్!

కుంభమేళలో సోషల్ మీడియా సంచలనంగా మారిన మోనాలీసా ఇప్పుడు హీరోయిన్ గెటప్ లో వేదికపై నుంచి అభిమానులకు అందంగా చేతులు ఊపుతూ పలకరిస్తోంది!

Update: 2025-02-15 08:47 GMT

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తరలివస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని కోట్ల మంది భక్తుల్లోనూ పూసల దండలు అమ్మే మోనాలిసా అనే అమ్మాయి సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆమె రాత్రికి రాత్రి సోషల్ మీడియా సెలబ్రెటీ అయిపోయింది.

ఇదే సమయంలో... ఆమె ఇటీవల తన తొలి బాలీవుడ్ సినిమాకు సంతకం చేసింది. ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేరళలోని ఓ బంగారు దుకాణం ఓపెనింగ్ కు హాజరైంది మోనాలిసా.. ఈ సందర్భంగా ఆమె మొదటిసారిగా విమానంలో ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... కుంభమేళలో సోషల్ మీడియా సంచలనంగా మారిన మోనాలీసా ఇప్పుడు హీరోయిన్ గెటప్ లో వేదికపై నుంచి అభిమానులకు అందగా చేతులు ఊపుతూ పలకరిస్తోంది! కేరళలోని ఓ బంగారు దుకాణం ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైంది. దీనికి సంబంధించిన అన్ని వీడియోలనూ సోషల్ మీడియా వేదికగా పంచుకొంది.

మోనాలిసా భోంస్లే ఫిబ్రవరి 14న కేరళలోని కోజికోడ్ కు వెళ్లారు. వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు హోస్ట్ చేసిన దుకాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను చూడటానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరవ్వడం గమనార్హం. ఈ సందర్భంగా.. ఆమె తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పింది.

కాగా.. మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్ కు చెందిన మోనాలిసా తన కుటుంబంతో కలిసి రుద్రాక్షలు, పూసల దండలు అమ్మడానికి మహాకుంభమేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమయంలో ఆమె అద్భుతమైన అందం ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది! ఫలితంగా ఆమె రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది.

ఇదే సమయంలో.. నెట్టింట ఆమె సంపాదించుకొన్న ప్రజాదరణ సినిమాల్లో అవకాశాలు ఇచ్చేలా చేసింది. ఇందులో భాగంగా.. ‘ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ కు దర్శకత్వం వహించిన సనోజ్ మిశ్రా దర్శకత్వం వహించనున్న "ది డైరీ ఆఫ్ మణిపూర్" చిత్రంలో ఆమె ఓ ముఖ్యపాత్రలో కనిపించనుంది!

Tags:    

Similar News