అతడితోనే తాగి.. అతడినే కొట్టి.. అతడి భర్యపై సామూహిక అత్యాచారం!

ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు యువకులు, పెదవేగి మండలానికి చెందినట్లు చెప్పుకున్న వ్యక్తితో కలిసి మద్యం తాగారు.

Update: 2024-08-18 06:38 GMT

భర్తతో కలిసి మద్యం తాగారు కొందరు యువకులు.. బాగా మత్తు ఎక్కాక అతడిని చితకబాదారు.. అనంతరం అతడి భార్యపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ సంఘటన ఏలూరులో శుక్రవారం అర్థరాత్రి దాటాక చోటుచేసుకుంది. మూడు పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

అవును... ఏలూరులో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ దారుణం జరిగింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం పెదవేగి మండలంకి చెందిన ఓ వ్యక్తి, అతని రెండో భర్య ఏలూరు వన్ టౌన్ రామకోటి ప్రాంతంలో ఉంటున్నారు. అయితే రెండు వారాలా క్రితం నగరానికి కొంతమంది యువకులు వచ్చారు. వీరంతా పగలు హోటల్లో పనిచేస్తుంటారు.

ప్రస్తుతానికి అద్దె ఇల్లు దొరకకపోవడంతో.. రాత్రిళ్లు రామకోటిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్టేజీ అరుగులపై విశ్రమిస్తుంటారు. ఈ క్రమంలో నగరానికి చెందిన ముగ్గురు యువకులు వారికి పరిచయమయ్యారు. వారంతా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరిగే బ్యాచ్!

ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు యువకులు, పెదవేగి మండలానికి చెందినట్లు చెప్పుకున్న వ్యక్తితో కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో పక్కనే అతని భార్య నిద్రిస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం మత్తు ఎక్కిన తర్వాత ముగ్గురు యువకులు అతనిపై దాడి చేశారు. అనంతరం నిద్రిస్తున్న అతడి భర్యను కొంచెం దూరం లాక్కెళ్లి అత్యాచారం చేశారు.

అనంతరం ఆమె ముఖంపైనా దాడి చేశారు. ఈ సమయంలో అప్పటికే గాయపడిన ఆమె భర్త గట్టిగా కేకలు వేశాడు. అటుగా వెళ్తున్న యువకుడికి విషయం చెప్పి రక్షించాలని కోరాడు. దీంతో.. ఆ యువకుడు స్పందించి ఘటనా స్థలానికి వస్తుండటంతో ముగ్గురు నిందితులూ పరారయ్యారు.

ఈ నేపథ్యంలో నిందితులు ముగ్గురునీ ఏలూరు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను నూతిపల్లి పవన్, నారపాటి నాగేంద్ర, గడ్డి విజయ్ కుమార్ లుగా పేర్కొన్నారు. శనివారం వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

మరోవైపు... ఈ ఘటన జరిగిన సమయంలో భర్త అరుపులు విని అక్కడకు వచ్చిన యువకుడు డయల్ 100కు కాల్ చేసినా సరిగా స్పందించలేదని చెబుతున్నారు. తర్వాత సమీపంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయం చెప్పగా వారు వెంటనే రియాక్ట్ అయ్యి ఘటనా స్థలానికి వచ్చినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News