'కుల గణన' చరిత్రలో నిలిచిపోతుంది: రేవంత్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన చరిత్రలో నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన చరిత్రలో నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ లో తాజాగా ఆయన కుల గణన నివేదికను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుల గణన కోసం 161 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని.. సమగ్ర వివరాలతో రూపొందించినట్టుచెప్పారు. ``తెలంగా ణ సమాజంలో ఇదొక మోడల్ నివేదికగా నిస్తుంది. కుల గణనకుపూర్తిస్థాయి చట్ట బద్ధత కల్పిస్తున్నాం`` అనిరేవంత్ రెడ్డి చెప్పారు.
కల గణన చేపట్టినప్పుడు అనేక మంది విమర్శలు చేశారని.. అయినా.. పట్టుదలతో కుల గణన చేపట్టినట్టు మంత్రి వివరించారు. ఈ మహా క్రతువులో అనేక మంది కృషి చేసినట్టు తెలిపారు. ఈ సర్వే ద్వారా విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ అవకాశాలు కల్పించేందుకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుం దన్నారు. ఇప్పటి వరకుఎవరుఎంత మంది ఉన్నారో.. తెలియని పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక స్పష్టత వచ్చిందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలని, అభినందించాలని సూచించారు.
15 ఇళ్లను ఒక యూనిట్‌గా తీసుకుని ఈ సర్వే చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సుమారు 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఈ నివేదికను రూపొందించారని చెప్పారు. రాష్ట్రంలో 56 శాతం మంది ఉన్న బీసీలకు తగిన గౌరవం లభించేందుకు ఈ గణన ఉపయోగపడుతుందన్నారు. వెనుకబడి వర్గాలకు వెలుగు ప్రసాదించాలన్న లక్ష్యంతో దీనిని అమలు చేయనున్నట్టు తెలిపారు. సర్వే ఏదో కన్నీటి తుడుపు చర్య కాదన్న రేవంత్.. అనేక వర్గాల వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు.
75 అంశాలను ప్రాతిపదికగా చేసుకుని కులగణనను చేపట్టినట్టు సీఎం తెలిపారు. మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాల్లోని వారి సమగ్ర వివరాలను ఈ నివేదికలో పొందుపరిచినట్టు సీఎం చెప్పారు. పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే జరుగగా.. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాల్లో సర్వే జరిగిందని తెలిపారు. కుల సర్వే డేటాను సంక్షేమ పథకాల తయారీకి, అణగారిని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి వినియోగించనున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు.