టార్గెట్ కాంగ్రెస్‌.. నిప్పులు చిమ్మిన కేసీఆర్‌

తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం తీరు.

Update: 2023-08-06 17:38 GMT

ఆది నుంచి చివ‌రి వ‌ర‌కు టార్గెట్ కాంగ్రెస్‌.. ఆసాంతం ప్ర‌తి మాట‌లోనూ.. ప్ర‌తి ప‌దంలోనూ... ప‌ద విరుపులోనూ టార్గెట్ కాంగ్రెస్‌. ఇదీ.. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం తీరు. సింగ‌రేణి నుంచి మొద‌లు పెట్టి.. ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు వ‌ర‌కు .. దేనినీ ఆయ‌న వ‌దల్లేదు. ప్ర‌తి విష‌యంలోనూ కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుని మాట‌ల తూటాలు.. ప‌దాల శ‌త‌ఘ్నుల‌ను పేల్చేశారు. అంసెబ్లీ వేదిక‌గా ఆయ‌న విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ఇచ్చుడు.. స‌చ్చుడు.. అంటూ.. త‌న‌దైన శైలిలో `స‌న్నాసులం` టూ ఏకేశారు.

సింగరేణిని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీనేన‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అప్పులు కట్టలేక 49 శాతం వాటాను కాంగ్రెస్ అమ్మేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఐటి ఉద్యోగుల సంఖ్య 3 లక్షలుగా ఉంటే.. త‌న పాలనలో 6లక్షల 15వేలకు చేరింద‌ని చెప్పుకొచ్చారు.

``మేం తెలంగాణ కోరే వ‌ర‌కు ఏం చేసింది గీ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడ గొట్టింది ఆ పార్టీ గాదా అధ్య‌క్షా!`` అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ``తెలంగాణ ఉన్నది ఉన్నట్టు(1956 నాటి ఉమ్మ‌డి ఏపీలో క‌ల‌ప‌కుండా) ఉంటే ఎక్కడో ఉండేది. కానీ, డిల్లీ గ‌ద్ద‌లు అలా బ‌త‌క‌నిచ్చిన్రా? పోయి పోయి కుంప‌టి పెట్టిన్రు! లాక్క‌లేక పీక్క‌లేక‌.. మ‌నం కాదా ఉద్య‌మాలు చేసింది`` అంటూ కాంగ్రెస్‌ను ఏకేశారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించింద‌న్నారు. కేంద్రంలో మమ్మల్ని రాచి రంపాన పెట్టే పార్టీ ప్రభుత్వమే ఉందంటూ.. పేరు పెట్ట‌కుండానే బీజేపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌స్తావించారు.

రాష్ట్రం విడిపోతే.. తెలంగాణ ఏదో అయిపోతుందంటూ.. ఎకసెక్కాలు చేసిన ఏపీ కంటే ఇప్పుడు తెలంగాణ‌.. పర్ క్యాపిటా లక్ష రూపాయలు ఎక్కువగా ఉంద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమ్మిళిత అభివృద్ధితోనే ఇది సాధ్యం అయిందన్నారు. రాష్ట్రంలో పంట మొత్తం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేన‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 3 కోట్ల ట‌న్నుల‌ వరి ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలో నంబర్ వన్ అని.. ధరణి రద్దు చేసి ఏం చేస్తారో కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాలని స‌భ‌లో ఉన్న భ‌ట్టి వైపు చూపిస్తూ వ్యాఖ్యానించారు.

``ధరణి తీస్తాం అనే వారికి ఇంగితం ఉండాలి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. బీఆర్ఎస్‌ను బీజేపీకి బీ టీమ్ అన్నారు.... సీన్ కట్ చేస్తే ఆయనే వెళ్లి బీజేపీలో జొర్రిండు`` అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మైనార్టీ హక్కుల కోసం కొట్లాడే ఎంఐఎంను బి టీమ్ అంటున్నారని.. మజ్లీస్- బీఆర్ఎస్ ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో కూడా ఫ్రెండ్లీ పార్టీలుగానే ఉంటామని కేసీఆర్ తేల్చేశారు.

Tags:    

Similar News