దేశంలో పది ధనిక రాష్ట్రాలు.. మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో..?

భారతదేశంలోని సంపన్న రాష్ట్రాల జాబితా విడుదలైంది. దేశంలో పది సంపన్న రాష్ట్రాల జాబితాను రిలీజ్ చేశారు.

Update: 2024-10-05 22:30 GMT

భారతదేశంలోని సంపన్న రాష్ట్రాల జాబితా విడుదలైంది. దేశంలో పది సంపన్న రాష్ట్రాల జాబితాను రిలీజ్ చేశారు. 2023-24లో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి, తలసరి స్థూల దేశీయోత్పత్తి ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. అందులో మహారాష్ట్ర మొదటి స్థానం కైవసం చేసుకుంది. తరువాతి స్థానాల్లో ఏయే రాష్ట్రాలు నిలిచాయి..? మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో..? ఒకసారి తెలుసుకుందాం.

ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగా దేశంలోనూ అత్యధిక రిచెస్ట్ రాష్ట్రాలనూ ఎంపిక చేసింది. దేశంలో 28 రాష్ట్రాలుండగా.. 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ధనిక రాష్ట్రాల్లో మహారాష్ట్ర (రూ.42.67 లక్షల కోట్లతో) మొదటి స్థానంలో నిలిచింది.

రెండో స్థానంలో తమిళనాడు (రూ.31.55 లక్షల కోట్లతో), మూడో స్థానంలో కర్ణాటక (రూ.28.09లక్షల కోట్లతో), నాలుగో స్థానంలో గుజరాత్ (రూ.27.09 లక్షల కోట్లతో), ఐదవ స్థానంలో ఉత్తరప్రదేశ్ (రూ.24.99 లక్షల కోట్లతో) నిలిచాయి. ఇక.. ఆరో స్థానంలో పశ్చిమబెంగాల్ (రూ.18.08 లక్షల కోట్లతో), ఏడో స్థానంలో రాజస్థాన్ (రూ.17.08లక్షల కోట్లతో) నిలిచాయి. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి తెలంగాణ 8వ స్థానంలో (రూ.16.05 లక్షల కోట్లతో), ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో (రూ.15.89 లక్షల కోట్లతో), మధ్యప్రదేశ్ (రూ.15.22 లక్షల కోట్లతో) పదో స్థానంలో నిలిచాయి.

మహారాష్ట్ర మొదటి నుంచి బాలీవుడ్‌కు కేంద్రంగా ఉండడం.. బలమైన పారిశ్రామిక వేత్తలకు కేరాఫ్‌గా ఉండడంతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. మరోవైపు.. 2030-37 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జీడీపీ దాదాపు రెండింతలు అవుతుందని ఎస్ అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. 7 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరుగుతుందని చెప్పింది. వార్షిక వృద్ధి రేటు 6.7 శాతంగా కొనసాగుతుందని అంచనా వేసింది.

Tags:    

Similar News