అక్కడే బలం : వైసీపీ ధీమా అదేనా...!?

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు.

Update: 2024-03-24 02:45 GMT

ఏపీలో మరోసారి గెలిచేస్తామని వైసీపీ చెబుతూ వస్తోంది. ఇది ఎన్నికల స్టంట్ అని అందరూ అనుకున్నా ఆ పార్టీ లెక్కలు కచ్చితంగా ఉన్నాయహి అంటున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. అయితే అది ఎక్కువగా అర్బన్ ప్రాంతాలలోనే అని అంటున్నారు.

తాజాగా వస్తున్న కొన్ని సర్వేలను చూస్తే రూరల్ బేస్ వైసీపీకి బలంగా ఉందని అంటున్నారు. అక్కడ నూటికి డెబ్బై మంది దాకా వైసీపీకి జై కొడుతున్నారు అని అంటున్నారు. అదే అర్బన్ సెక్టార్ లో చూస్తే నూటికి పాతిక నుంచి ముప్పయి శాతం మాత్రమే మద్దతుగా ఉన్నారని అంటున్నారు.

దాంతో వైసీపీ కూడా రూరల్ మీదనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. గత ఏడాది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలు అయినపుడు వైసీపీ పెద్దలు చెప్పినది కూడా ఇదే. మా ఓట్లు వేరే ఉన్నాయని కూడా వారు లాజిక్ తీసి మాట్లాడారు.

వైసీపీ అందిస్తున్న పధకాలలో ఎక్కువ లబ్ది రూరల్ సెక్టార్ కే దక్కుతోందని అందువల్ల పల్లెలు తమ వైపు ఉంటే అదే శ్రీరామ రక్ష అని కూడా వారు భావిస్తున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో అసలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు అంటే అక్షరాలా నాలుగు కోట్ల పదమూడు లక్షలు అని లెక్క తేల్చింది ఎన్నికల సంఘం.

ఇందులో కనుక చూస్తే అర్బన్ సెక్టార్ కి చెందిన ఓటర్లు 85 లక్షల మంది దాకా ఉంటారని లెక్క ఉంది. అదే రూరల్ సెక్టార్లో ఓటర్లు మూడు కోట్ల 30 లక్షల మంది అని అంటున్నారు అని చెబుతున్నారు. ఈ అర్బన్ ఓటర్లలో ఎక్కువగా ఉన్న వారిలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లోనే ఎక్కువ. వారంతా 55 లక్షల మంది దాకా ఉంటారని అంటున్నారు.

ఇలా పక్కాగా లెక్కలు ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే రూరల్ సెక్టార్ కిందకు వచ్చే మూడు కోట్ల 30 లక్షల ఓట్లలో వైసీపీ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటోందని అంటున్నారు. అర్బన్ ఒటర్లలో ఏ ఇరవై శాతం పడినా రూరల్ ఓటర్లలో డెబ్బై శాతం వైసీపీకే పడితే తమ విజయం సునాయాసం అవుతుంది అని అంటున్నారు.

అలా ఎందుకు అంటే ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో యాభై దాకా అర్బన్ ప్రభావితమైన నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన 125 రూరల్ సెక్టార్ ప్రభావంతోనే ఉన్నాయని లెక్క ఉంది. దీంతో వైసీపీ ఈ 125 సీట్లలో తమకు అత్యధిక శాతం దక్కుతాయని దాంతో మరోసారి అధికారంలోకి రావచ్చు అని అంచనా కడుతోందని అంటున్నారు.

అయితే టీడీపీ కూడా ఏమీ తక్కువ తినలేదు. రూరల్ అర్బన్ అన్న తేడా లేకుండా మొత్తం ఏపీ ఓటర్లు ఈసారి ఓటు వైసీపీకి యాంటీగా వేస్తారు అని అంటున్నారు. ఈ రకమైన డివిజన్ ఎపుడూ రాలేదని అది వైసీపీ నేతల భ్రమ అని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఎవరి ధీమా వారిది ఎవరి ఆశలు వారివి ఫలితాలు వచ్చాకనే అసలు విషయం బయటపడుతుంది అన్నది నిఖార్సు అయిన నిజం.

Tags:    

Similar News