.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ప్రాంతీయ బోర్డులు...బాబు కొత్త వ్యూహం ?

ప్రాంతానికి ఏమి ప్రగతి జరిగింది అన్నది పక్కన పెడితే చాలా మందికి రాజకీయంగా చాన్స్ వచ్చింది.

Update: 2024-06-30 16:30 GMT

ఉమ్మడి ఏపీలో ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేసి చాలా మంది రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం కల్పించిన పరిస్థితి ఉంది. దాని వల్ల ప్రజలకు ఏమి మేలు జరిగింది. ప్రాంతానికి ఏమి ప్రగతి జరిగింది అన్నది పక్కన పెడితే చాలా మందికి రాజకీయంగా చాన్స్ వచ్చింది. జనంలోకి వారు వెళ్లేందుకు వీలు చిక్కింది. ఒక కుర్చీ దక్కింది.

ఇక విభజన ఏపీలో అయితే జగన్ ప్రభుత్వం ఉండగా ప్రాంతీయ మండళ్ల విషయం చర్చకు వచ్చింది. ప్రాంతీయ స్థాయిలో అభివృద్ధి మండలి నియామకం చేయాలని వాటి చైర్మన్లకు కేబినెట్ ర్యాంక్ ఇచ్చి మంత్రి పదవులు దక్కని వారిని అందులో కూర్చోబెట్టాలని యోచించారు.

అయితే ఆర్ధిక పరమైన సమస్యలతో పాటు పాలనపరంగా రాజకీయంగా కూడా సమస్యలు కొత్తవి ఎదురవుతాయని భావించి తరువాత దశలో ఆగిపోయారు. అయితే ఇపుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ తరహా ఆలోచన చేస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది. ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు అంటే ఉత్తరాంధ్ర గోదావరి, దక్షిణాంధ్ర రాయలసీమ ఇలా నాలుగు బోర్డులను ఏర్పాటు చేయవచ్చు. ఉమ్మడి జిల్లాలను మూడు నుంచి నాలుగు కవర్ అయ్యేలా చూడవచ్చు.

ఈ ప్రాంతీయ బోర్డులు ఆయా ప్రాంతాలలో అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలించి వాటిని ప్రభుత్వానికి నివేదిస్తాయి. వీటిని ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తే వాటితో అభివృద్ధి చేసేందుకు వీలు అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మంత్రి హోదాకు సరిసమానంగా వీటిని డిజైన్ చేయవచ్చు.

Read more!

కానీ అదే సమయంలో సమాంతర వ్యవస్థగా మారితే మాత్రం రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం ప్రతీ జిల్లాకూ ఒక మంత్రి ఉన్నారు. తొందరలోనే ఇంచార్జి మంత్రులను కూడా నియమిస్తారు. అలా ఏ జిల్లాకు ఆ జిల్లాలో రాజకీయ పెత్తనం సాగుతుంది ఈ బోర్డులు మధ్యలో వచ్చి ఆధిపత్యం చేస్తామంటే ఊరుకునేది ఉండదు అని అంటున్నారు.

ఇక జిల్లా మంత్రి ఎక్కువ అభివృద్ధి మండళ్ళ చైర్మన్ ఎక్కువ అన్న సమస్య వస్తుంది, అలాగే కేబినెట్ ర్యాంక్ ఇస్తే ప్రోటోకాల్ సమస్య కూడా వస్తుంది. దాంతో రాజకీయంగా వివాదాలు కొత్తవి వస్తాయన్న ఆలోచనలూ ఉన్నాయట.

అయితే చాలా మంది సీనియర్లు మంత్రి పదవులకు నోచుకోక జస్ట్ ఎమ్మెల్యేలుగానే మిగిలిపోయారు. అలా చూసుకుంటే ఉత్తరాంధ్రాలో కిమిడి కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, కూన రవి కుమార్, బెందాళం అశోక్ వంటి వారు ఉన్నారు.

ఇదే రకంగా ఇతర జిల్లాలలోనూ లెక్కకు మిక్కిలిగా సీనియర్లు ఉన్నారు. మరో మూడేళ్ల వరకూ మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణకు చాన్స్ లేదు. అలా చేసినా అతి తక్కువ మందికే అవకాశాలు వస్తాయి. దాంతో వీరికి ఎలా న్యాయం చేయడం అన్నది అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. అయితే అభివృద్ధి మండలి ఏర్పాటు వల్ల ఖజానాకు భారం తప్ప మరోటి కానే కాదు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News