ప్రపంచ కుబేరుడిగా కొత్త వ్యక్తి... మస్క్ ను అధిగమించి రికార్డ్!
ఈ క్రమంలో బెజోస్, మస్క్ తర్వాత స్థానంలో ఆర్జాల్ట్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన తాజా సంపద 197 బిలియన్ డాలర్లుగా ఉంది.
సోమవారం నాడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా షేర్లు భారీగా పతనం కావడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా ఎలోన్ మస్క్ తన టాప్ ప్లేస్ ను కోల్పోయాడు. ఈ నేపథ్యంలో... బ్లూమ్ బెర్గ్ తాజా బిలియనీర్స్ ఇండెక్స్ లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అగ్రస్థాన్ని సంపాదించుకున్నారు. దీంతో ఇటీవల కాలంలో ప్రపంచ కుబేరుడిగా కొత్త వ్యక్తి నిలిచినట్లయ్యింది!
అవును... 2021 తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. మస్క్ ను తొలిసారి అధిగమించాడు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ తాజా ఇండెక్స్ ప్రకారం... జెఫ్ బెజోస్ తాజా సంపాద 200 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే... ఇండియన్స్ కరెన్సీలో ఇది సుమారు రూ.16.58 లక్షల కోట్లు అన్నమాట. ఇదే సమయంలో... ఎలోన్ మస్క్ సంపద $198 బిలియన్లుగా ఉండగా... అది ఇండియన్స్ కరెన్సీలో రూ.16.41 లక్షల కోట్లకు సుమారుగా సమానం మన్నమాట. అంటే... ఇద్దరి మధ్యా వ్యత్యాసం పెద్దగా లేనప్పటికీ... ఫస్ట్ ప్లేస్ ఆల్ వేస్ ఫస్ట్ ప్లేస్ అనేది తెలిసిందే!
తాజాగా సోమవారం మస్క్ కు చెందిన టెస్లా షేర్లు భారీగా పతనం అవ్వడంతో ఒక్కరోజులోనే ఈ స్టాక్ ఏకంగా 7.16 శాతం పడిపోయింది. ఫలితంగా షేర్ వేల్యూ 188.14 యూఎస్ డాలర్లకు చేరింది. దీంతో... టెస్లా భారీ పతనాన్ని చవిచూడాల్సి వచ్చింది. వాస్తవానికి ఒక దశలో మస్క్ కు బెజోస్ కు మధ్య సంపద వ్యత్యాసం ఏకంగా 142 బిలియన్ డాలర్లుగా ఉండేది! ఈ క్రమంలో అమెజాన్ షేర్లు గణనీయంగా పుంజుకోవడంతో 2022 నుంచి ఈ షేర్లు రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలోనే బెజోస్ సరికొత్త రికార్డ్ దిశగా ప్రయాణం కొనసాగించారు.
ఇక గత కొన్నెళ్లుగా లూయుస్ విట్టన్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ టాప్ ప్లేస్ లో కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ ర్యాంక్ లో ఎక్కువకాలం కొనసాగలేకపోయారు. మస్క్ మాత్రం ఈ ర్యాంక్ లో చాలా కాలంగా కొనసాగారు! ఈ క్రమంలో బెజోస్, మస్క్ తర్వాత స్థానంలో ఆర్జాల్ట్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన తాజా సంపద 197 బిలియన్ డాలర్లుగా ఉంది.
బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ లేటెస్ట్ ఇండెక్స్ ప్రకారం టాప్ 12 లిస్ట్ ఈ విధంగా ఉంది!
జెఫ్ బెజోస్ - $ 200 బిలియన్స్
ఎలోన్ మస్క్ - $ 198 బిలియన్స్
బెర్నార్డ్ ఆర్నాల్ట్ - $ 197 బిలియన్స్
మార్క్ జుకెర్ బర్గ్ - $ 179 బిలియన్స్
బిల్ గేట్స్ - $ 150 బిలియన్స్
స్టీవ్ బామర్ - $ 143 బిలియన్స్
వారెన్ బఫెట్ - $ 133 బిలియన్స్
లారీ ఎలిసన్ - $ 129 బిలియన్స్
లారీ పేజ్ - $ 122 బిలియన్స్
సెర్జ్ బ్రిన్ - $ 116 బిలియన్స్
ముఖేష్ అంబానీ - $ 115 బిలియన్స్
గౌతం అదానీ - $ 104 బిలియన్స్