రాజమండ్రి హైవేలో సుడిగాలి భీభత్సం
మిచౌంగ్ తుఫాన్ ధాటికి ఇప్పుడు రాజమండ్రి హైవేలో ఇలాంటి టోర్నడో ఒకటి షికార్ చేసింది.
ఇన్నాళ్లు అమెరికాలో టోర్నడో(సుడిగుండం) భృభత్సం టీవీలు యూట్యూబుల్లో చూశాం. టెక్సాస్, కాలిఫోర్నియాలో టోర్నడోల దెబ్బకు పదుల సంఖ్యలో ప్రజలు చనిపోగా, చెట్లు ఇల్లు నేలమట్టం అయిన వీడియోలు సంచలనం అయ్యాయి. ఇప్పుడు ఆ టోర్నడోలు తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించాయి. మిచౌంగ్ తుఫాన్ ధాటికి ఇప్పుడు రాజమండ్రి హైవేలో ఇలాంటి టోర్నడో ఒకటి షికార్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. కోనసీమలో టోర్నడో తీవ్రతను తెలుగు రాష్ట్రానికి తీసుకొచ్చింది మిచౌంగ్.
రాజమండ్రిలో ఆకస్మిక సుడిగాలి స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ సుడిగాలి తీవ్రతకు రహదారి వెంబడి పెద్ద చెట్లు నేలకూలాయి. పెద్ద పెద్ద హోర్టింగ్‌లు, రేకుల షెడ్‌లు గాలిలో ఎగిరాయి. రహదారిపై వెళ్తున్న వాహనదారుడు కింద పడ్డాడు. దీంతో చాలామంది వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రోడ్లపై ప్రజలు పరుగులు తీస్తున్న వైనం కలవరపెట్టింది.
పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. వీటి వల్ల ప్రజలకు పెను ప్రమాదం పొంచి ఉందని కూడా ఈ వీడియో చెబుతోంది. ఒకవైపు చెన్నై, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, బాపట్ల వంటి నగరాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. తీరం వెంబడి వైజాగ్ వరకూ భీభత్సమైన వర్షాలు పడుతున్నాయి. మరో 48గం.లు మాత్రం ప్రమాదకరం అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే ప్రజల్లో గుబులు పుట్టించే సుడిగుండం తిరగడం అనేది కోనసీమలో మాత్రమే కనిపించింది.