లోగో రేపుతున్న ప్రకంపనలు !

తెలంగాణలో టీఎస్ఆర్టీసీ కొత్త లోగో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్ స్థానంలో టీజీ ఉండాలని ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

Update: 2024-05-24 09:13 GMT

తెలంగాణలో టీఎస్ఆర్టీసీ కొత్త లోగో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్ స్థానంలో టీజీ ఉండాలని ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. వరసగా అన్ని ప్రభుత్వ శాఖలు టీఎస్ స్థానంలో టీజీగా మారుస్తూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీని టీజీఎస్ ఆర్టీసీగా మారుస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పలు మీడియా ఛానళ్లు, సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టిన లోగోలలో పాత లోగోలో ఉన్న వరంగల్ కాకతీయ తోరణం, ఛార్మినార్ కనిపించ లేదు. దీంతో పలువురు దీనిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

దీనిపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం మాజీ తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం, అమెరికాలో ఉంటున్న హరీష్ రెడ్డిపై కేసులు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

‘తెలంగాణ ముఖ్యమంత్రే నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నాడు. అతన్ని ఎందుకు జైల్లో పెట్టకూడదు. తన బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్ కాంట్రాక్ట్ వచ్చిందని సీఎం ఆరోపించాడు. సచివాలయం కింద నిజాం నగలు తవ్వుకున్నట్లు చెప్పాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేశారు. ఓయూకు చెందిన నకిలీ సర్క్యులర్‌ను పోస్ట్ చేశారన్నారు. ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న వ్యక్తిని జైల్లో ఎందుకు పెట్టకూడదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి

Tags:    

Similar News