స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి జిమ్ కూడా!... అధ్యయనంలో షాకింగ్ విషయాలు!?

స్పెర్మ్ కౌంట్ పై ఫిట్ నెస్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయంపై తాజాగా అధ్యయనం చేశారు!

Update: 2024-10-17 04:04 GMT

ఇటీవల కాలంలో దంపతులకు ఫెర్టిలిటీ సమస్యలు బాగా పెరుగుతున్నాయి. ఈ విషయంలో మగవారూ, ఆడవారనే తేడా ఉండదు.. ఈ సమయకు ఇద్దరిలోనూ కారణాలు ఉంటాయి! ఇదే విషయాన్ని నిపుణులు నొక్కి చెబుతున్నారు. వివిధ కారణాల వల్ల వంధ్యత్వం కావొచ్చని చెబుతూ.. ఆ కారణాల్లో ఫిట్ నెస్ కూడా ఒకటని చెబుతున్నారు.

అవును... ఇటీవల కాలంలో పురుషుల్లో వంద్యత్వ రేటు బాగా పెరుగుతుందని అంటున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, కాలుష్యం, మొదలైన అలవాట్లే దీనికి కారణం అని భావిస్తున్న సమయంలో... స్పెర్మ్ కౌంట్ పై ఫిట్ నెస్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయంపై తాజాగా అధ్యయనం చేశారు!

ఈ అధ్యయనంపై షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది. ఇటీవల కాలంలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం అనేది అత్యంత సహజం అనేలా మారిపోయిన నేపథ్యంలో... ఫిట్ నెస్ పరిశ్రమలో ఉన్నవారిలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడైందని అంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి!

తాజగా యూకేలో జరిపిన అధ్యయనంలో సంతానోత్పత్తి చికిత్స అవసరమైన పురుషుల సంఖ్య భారీగా పెరిగినట్లు గుర్తించారంట. వీరిలో జిమ్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది. జిమ్ లో ఎక్కువ సమయం గడిపేవారిలో ఈ సమస్య స్పష్టంగా కనిపించిందని నిపుణులు చెప్తున్నారని తెలుస్తోంది.

ఫిట్ నెస్ కోచ్ లు, ఫిట్ నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఎక్కువ సమయం జిమ్ లో గడిపేవారు ఎక్కువ సమయం టైట్ జిమ్ వేర్ లో ఉంటారు. ఇక జిమ్ లో పనిచేసేవారైతే సుమారు 12 గంటల వరకూ జిమ్ లో అదే డ్రెస్ లో ఉంటారు! వారంలో ఆరు రోజులు దాదాపు అలాంటి దుస్తులే వేసుకుంటారు!

దీనివల్ల "ఆ"ప్రాంతంలో వేడి ఎక్కువై ఫెర్టిలిటీ సమస్యను పెంచుతుందని అంటున్నారు! ఇదె సమయంలో... సహజంగానే మగవారి శరీరంలో హీట్ ఎక్కువగా ఉంటుందని.. రోజులో ఎక్కువగా వర్క్ అవుట్ చేయడం వల్ల ఆ హీట్ మరింత పెరుగుతుందని.. దీనివల్ల వారు యాక్టివ్ గా ఉన్నట్లు కనిపిస్తారు కానీ.. ఆ వేడికి స్పెర్మ్ కణాలు కిల్ అవుతుంటాయని చెబ్బుతున్నారు.

అందువల్ల జిమ్ కి వెళ్లడాన్ని తగ్గించి, వీలైనంత వరకూ వదులుగా ఉండే దుస్తులు వేసుకునేవారిలో స్పెర్మ్ కౌంట్ పెరిగినట్లు గుర్తించారట నిపుణులు. ఈ అధ్యయనం ప్రకారం అధిక వ్యాయామం కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఒక కారణమవుతుందని అంటున్నారు. అందువల్ల జిమ్ లో తక్కువ సమయం గడపడమే మేలని అంటున్నారు!

ఇక స్త్రీల విషయానికొస్తే... లేట్ మ్యారేజ్, ల్యాప్ ట్యాప్ ముందు ఎక్కువసమయం ఉండటం, స్టీమ్ బాత్ వంటివి ఫెర్టిలిటీ సమస్యకు కారణాలుగా ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News