యూపీలో ఘోరం: రోడ్డు ప్రమాదంలో 8 మంది సజీవ దహనం.. తప్పించుకునేవారే కానీ!!
రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో చెప్పడం కష్టం. తప్పు మనదే అయినా.. పక్కవారిదే అయినా.. ఏ చిన్న పొరపాటు జరిగినా.. ప్రాణాలు పిట్టల్లా రాలిపోతాయి.
రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో చెప్పడం కష్టం. తప్పు మనదే అయినా.. పక్కవారిదే అయినా.. ఏ చిన్న పొరపాటు జరిగినా.. ప్రాణాలు పిట్టల్లా రాలిపోతాయి. ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. రోడ్డు ప్రమాదానికి గురైన కారు.. కారణంగా ఎనిమిది మంది అందులో ప్రయాణిస్తున్న వారు సజీవ దహనమయ్యారు. అయితే.. వీరు ప్రమాదానికి గురైనా తప్పించుకునే అవకాశం ఉంది. కానీ.. ఈ అవకాశమే చేజారి వారి జీవితాలను బుగ్గి చేసింది.
ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నియోజకవర్గం పరిధిలో ఉన్న జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం ఒకే కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది.. కాలి బూడిదయ్యారు. వీరంతా ఘజియాబాద్ నుంచి బరేలీలో జరుగుతున్న ఓ వివాహానికి వెళ్తున్నారు. వీరిలో ఓ చిన్నారి.. ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, వివాహ ఘడియ మించి పోతుండడంతో కారును నడుపుతున్న డ్రైవర్ (బంధువే) మితిమీరిన వేగంతో కారును నడిపాడు.
ఈ క్రమంలో జాతీయ రహదారిపై అదుపు తప్పిన కారు.. ఏకంగా.. మధ్యలో ఉన్న డివైర్‌ను దాటేసి.. పక్క రహదారిపైకి దూసుకుపోయింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయి పోవడంతో పాటు.. వెంటనే ట్రాంకర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు రాజుకున్నాయి. మరో వైపు కారు పల్టీ కొట్టగానే.. అందులోని కుటుంబ సభ్యులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.
కానీ, కారు సెంట్రల్ లాక్ పడిపోవడంతో ఎవరూ బయటకు రాలేక పోయారు. దీంతో కారు పేలిపోయి.. అం దరూ సజీవ దహనమయ్యారు. మృతి చెందిన వారి ముఖ కవళికలు కూడా అంతుచిక్కకుండా ఉన్నాయ ని బరేలీ ఎస్పీ తెలిపారు. మరోవైపు.. తన ప్రమేయం లేనప్పటికీ.. ప్రమాదానికి గురైన ట్రక్రు డ్రైవర్ మాత్రం క్షేమంగా బయటపడినట్టు చెప్పారు. ఈ ఘటనపై సీఎం యోగి విచారం వ్యక్తం చేశారు.