ఇక్కడ కుమారి ఆంటీ.. అక్కడ చంద్రిక దీక్షిత్!
కుమారి ఆంటీ పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబర్ల పుణ్యమాని హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్ అమ్మే కుమారి ఆంటీ అమాంతం ఫేమస్ అయిపోయారు.
కుమారి ఆంటీ పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబర్ల పుణ్యమాని హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్ అమ్మే కుమారి ఆంటీ అమాంతం ఫేమస్ అయిపోయారు. నెలకు తాను రూ.5 లక్షల వరకు ఫుడ్ పైన సంపాదిస్తానని కుమారి ఆంటీ చెప్పింది. అంతేనా ‘రెండు లివర్ల ఎక్సట్రా.. మీ బిల్లు రూ.1000’ అనే కుమారి ఆంటీ డైలాగ్ కూడా ఫుల్ ఫేమస్ అయిపోయింది. దీనిపైన ఎన్నో రీల్స్, షార్ట్స్ కూడా పుట్టుకొచ్చాయి.
అయితే కుమారి ఆంటీ పాపులర్ కావడంతోపాటు ఆమెకు కష్టాలు కూడా మొదలయ్యాయి. భారీ ఎత్తున జనాలు పోగవడంతో రోడ్డు పక్కన ఆమె భోజనశాల ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తోందని పోలీసులు తొలగించారు. ఆమె వైసీపీకి అనుకూలంగా మాట్లాడటం వల్లే తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని కుమారి ఆంటీ పొట్టకొట్టిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఆమె తన స్ట్రీట్ ఫుడ్ ను నడుపుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా వీలు చూసుకుని కుమారి ఆంటీ ఫుడ్ ను రుచిచూస్తానన్నారు.
ఇప్పుడు ఇదే కోవలో కుమారి ఆంటీ తరహాలోనే దేశ రాజధాని ఢిల్లీలో చంద్రిక దీక్షిత్ కూడా పాపులర్ అయ్యింది. ఈమె కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది.
చంద్రిక దీక్షిత్.. ఢిల్లీలోని సైనిక్ విహార్ లో రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద వడాపావ్ స్టాల్ ద్వారా పాపులర్ అయ్యారు. అందాల రాశి కావడంతోపాటు బాగా చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తుండటంతో యువకులు ఆమె వడాపావ్ స్టాల్ కు పోటెత్తుతున్నారు. దీంతో సోషల్ మీడియాతోపాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా దృష్టి కూడా చంద్రిక దీక్షిత్ పై పడింది.
ఈ నేపథ్యంలో చంద్రిక దీక్షిత్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ ఎత్తున యువకులు ఆమె ఫుడ్ స్టాల్ కు పోటెత్తుండటం, ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుండటంతో ఢిల్లీ కార్పొరేషన్ అధికారులు చంద్రికపై దృష్టి సారించారు. ఆమె స్టాల్ కు అనుమతి లేదని, మరికొన్ని ఇతర కారణాలతో ఆమె స్టాల్ ను అక్కడి నుంచి తీసేయాలని ఆదేశించారు.
దీంతో తన వడాపావ్ స్టాల్ తీయొద్దని బిగ్గరగా ఏడస్తూ అధికారుల కాళ్లావేళ్లా పడుతున్న చంద్రిక దీక్షిత్ వీడియోలు వైరల్ గా మారాయి. అధికారులు లంచం అడిగారని.. లంచం ఇవ్వకపోవడంతో స్టాల్ తీసేయమన్నారని ఆమె రోదించింది. దీంతో మన కుమారి ఆంటీకి అంతా మద్దతిచ్చినట్టే చంద్రికకు కూడా భారీ ఎత్తున మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో అధికారులు తాము ఆమెను లంచం అడగలేదని.. అనుమతి తీసుకోవాలని మాత్రమే కోరామంటున్నారు.