తన రెండో పెళ్లిపై వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాట్ కామెంట్స్... వీడియో వైరల్!
అవును... తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
నెల్లూరు జిల్లాలో పొలిటికల్ హీట్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. మెడలోని కండువాలు మారడంతో నిన్నమొన్నటివరకూ మిత్రులుగా ఉన్నవారు నేడు బద్దశత్రువుల మాదిరి మారిపోయారు. ఇందులో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతి రెడ్డిపై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రియాక్షన్స్ మొదలైపోయాయి. పైగా... ఇవి ప్రశాంతి రెడ్డి నుంచి రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అవును... తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో కూడా వైసీపీ నుంచి కానీ, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నుంచి కానీ పెద్దగా విమర్శలు రాలేదనే చెప్పాలి! వచ్చినా అవి రాజకీయాలకే పరిమితమయ్యాయి!! అయితే... ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి కోవూరు టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో వాతావరణం వేడెక్కింది. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇందులో భాగంగా... వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కాంత, కనకం, జూదం అంటే ఇష్టమని.. ఆ కార్యక్రమాలకు ఆయన ఛైర్మన్ అని కామెంట్ చేశారు! కాంత అంటే స్త్రీ.. కనకం అంటే డబ్బు.. జూదం అంటే పేకాట అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు.. వాటన్నింటికీ చైర్మన్ వేమిరెడ్డి అని అన్నారు. అలాంటి వ్యక్తి విజయసాయిరెడ్డిపై విమర్శలు చేయడం ఏమిటని ఫైర్ అయ్యారు.
ఇదే సమయంలో కోవూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్డి.. తన రెండో భర్తను వెనకేసుకు రావొద్దని నొక్కొ అన్నారు! దీంతో... పర్సనల్ అటాక్ గా మారిందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నేరుగా ప్రశాంతి రెడ్డి రంగంలోకి దిగారు. తనను తాను కోవూరు ప్రజలకు పరిచయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన కీలక ఘట్టాలను ప్రజల ముందు ఆవిష్కరించారు.
ఇందులో భాగంగా... "నేను మీ ఎమ్మెల్యే అభ్యర్థిని కాబట్టి.. నా పరిచయం మీకు అవసరం అని నేను భావిస్తున్నాను. మా తల్లితండ్రులు చిత్తూరు జిల్లాకు చెందినవారు. నేను తిరుపతిలో చదువుకున్నాను. అక్కడనంచి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి చెల్లెలు ఏ ఇంటికైతే కోడలిగా వెళ్లారో.. అదే ఇంటికి నేను కోడలిగా వెళ్లడం జరిగింది. అంటే... నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాడటం జరిగింది" అని తెలిపారు.
"అయితే.. అనివార్యకారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం.! తర్వాత నేను ఎంతోమందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని.. మా కుటుంబ సభ్యులు, నా అత్తగారింటి, నా పిల్లల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది" అని ఆమె స్పష్టంగా చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ విషయం నెల్లురు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది!