పక్క ప్లాన్ తో వస్తోన్న దళపతి... ఫస్ట్ స్పీచ్ వైరల్!

అవును... చెన్నైలోని తన కార్యాలయంలో ఫ్యాన్స్ క్లబ్ నాయకులతో వర్చువల్ గా మాట్లాడారు విజయ్.

Update: 2024-02-08 10:40 GMT

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాల్లో తనదైన సక్సెస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమిళనాట భారీ స్థాయిలో ఫ్యాన్ బెల్ట్ ఉన్న ఆయన... పాలిటిక్స్ లోకి రావాలని నిర్ణయించుకోవడం, పార్టీ పేరును ప్రకటించడం తెలిసిందే. అలా "తమిళగ వెట్రి కళగం" పార్టీని స్థాపించిన విజయ్ తాజాగా ఫ్యాన్స్ తో మాట్లాడారు. రాజకీయ పార్టీ ప్రకటించిన అనంతరం ఇచ్చిన ఈ ఫస్ట్ స్పీచ్ వైరల్ గా మారింది.

అవును... చెన్నైలోని తన కార్యాలయంలో ఫ్యాన్స్ క్లబ్ నాయకులతో వర్చువల్ గా మాట్లాడారు విజయ్. తన పొలిటికల్ ఎంట్రీ ప్రకటించిన తర్వాత ఆయన చేసిన ఫస్ట్ స్పీచ్ ఇది కావడంతో... ఆ స్పీచ్ పై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో చాలా మంది భావించినట్లుగానే... విజయ్ స్పీచ్ చాలా ప్లాన్డ్ గా, చాలా హుందాగా ఉందనే కామెంట్లను సొంతం చేసుకుంటుంది. దీంతో... ప్రస్తుతం తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని విజయ్ భర్తీచేసే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఈ సందర్భంగా స్పందించిన దళపతి విజయ్... అవరోధాలు, విమర్శలను చిరునవ్వుతో ఎదుర్కోవాలని.. ప్రజా సమస్యలపైనే దృష్టి సారించాలని.. తాము చేసే సంక్షేమ కార్యక్రమాల ద్వారా గ్రామాలలో పార్టీకి గుర్తింపు తీసుకురావాలని తన అభిమానులను కోరారు. ఇదే సమయంలో... 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత ఫ్యాన్స్ అంతా పార్టీ కోసం కీలకంగా పని చేయాలని.. ప్రధాన లక్ష్యం 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అని పేర్కొన్నారు.

ఈ విధంగా... రాజకీయ ప్రయాణంలో ఎదురయ్యే విమర్శలను చిరునవ్వుతో ఎదుర్కోవాలని.. పోరాటం చేయాల్సింది వ్యక్తులపై కాదని.. ప్రజా సమస్యలపై మాత్రమే పోరాటం చేయాలని దళపతి చెప్పడంతో... ఇది ఆయన విజన్ కు అద్దంపడుతుందని, విజయ్ చాలా క్లియర్ గా ఉన్నారని, ఆయన బలంగా ఫిక్సయ్యే పాలిటిక్స్ లోకి వచ్చారని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో ఆయన ఇచ్చిన స్పీచ్ స్పూర్తిదాయకంగా ఉందని చెబుతున్నారు.

కాగా... పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అనంతరం 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయమని, 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగానే తాము ఎన్నికల బరిలోకి దిగబోతున్నానని ఇప్పటికే విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని కూడా వార్తలు వస్తున్న సంగతీ తెలిసిందే!!


Tags:    

Similar News