విశాఖ ఎమ్మెల్యే వివాదాస్పద కానుకలు... వీడియో వైరల్!
ఇందులో భాగంగా... కనుమ రోజు తన క్యాడర్ కు చుక్క, ముక్క పంపిణీ చేశారు గణేష్. అదీ కూడా తన కాలేజీలోనే కౌంటర్ ఓపెన్ చేసి పంచడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వైభవంగా సాగిన సంగతి తెలిసిందే. బోగి, సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజుల పాటు ప్రతీ పల్లె వెలిగిపోయింది.. ప్రతీ ఇళ్లూ బందుమిత్రులతో కళకల్లాడింది. ఇక కనుమ రోజు నాన్ వెజ్ మార్కెట్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యకర్తలకు ఇచ్చిన కనుమ కానుక వివాదాస్పదంగా మారింది.
అవును... ఒకపక్క ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చిన సంక్రాంతి కావడంతో క్యాడర్ ను కానుకలతో ముంచెత్తించారు నేతలు! ఈ సమయంలో విశాఖ సౌత్ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు సీఎం జగన్ టిక్కెట్ కూడా కన్ ఫాం చేశారని తెలుస్తుంది. దీంతో పండగ ముహుర్తం చూసుకుని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పంపకాలు ప్రారంభించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా... కనుమ రోజు తన క్యాడర్ కు చుక్క, ముక్క పంపిణీ చేశారు గణేష్. అదీ కూడా తన కాలేజీలోనే కౌంటర్ ఓపెన్ చేసి పంచడం గమనార్హం. ఇలా కళాశాలలో తమ కార్యకర్తలకు మద్యం బాటిళ్లు, కోళ్లు పంపిణీ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. రామబాణం క్యాంపస్ అని కూడా పిలిచే ఈ కళాశాలలో... డిఫెన్స్ ఉద్యోగాలకు వెళ్లేందుకు శిక్షణ తీసుకునే విద్యార్థులు ఉంటారు.
ఇలా వారు కూర్చునే తరగతి గదుల్లో సుమారు 400 మద్యం బాటిళ్లు, కోళ్లు పంపిణీ చేసిన వైనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పైగా... ఈ పంపిణీ కోసం ముందు రోజే టోకెన్ లు పంపిణీ చేయడం మరో విశేషం. దీంతో అసలు 400 మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయంటూ ప్రశ్నలు మొదలైపోయాయి. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో... కళాశాల పై అంతస్తులో ఉన్న కార్యాలయం లోనే ఎమ్మెల్యే గణేష్ ఉన్నారని అంటున్నారు.