తూర్పు తిరిగి దండం పెట్టేది ఎవరు...!?
హోరా హోరీ పోరుగా సాగనున్న విశాఖ తూపులో ఎవరు విజేత అన్నది మాత్రం చెప్పలేమని అంటున్నారు. అయితే వైసీపీ తో పోలిస్తే టీడీపీ సేఫ్ జోన్ లో ఉందని అంటున్నారు.
విశాఖలో కీలకమైన నియోజకవర్గంగా తూర్పు అసెంబ్లీ సీటు ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ లో భాగంగా 2009 లో ఏర్పడిన విశాఖ తూర్పు ఇప్పటిదాకా ఒకే పార్టీ చేతిలో ఉంది. ఒక్కరే ఎమ్మెల్యేగా వరసగా గెలుస్తున్నారు. టీడీపీ ఇక్కడ పాగా వేసింది. అలాగే వెలగపూడి రామక్రిష్ణబాబు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు.
అయానకు తొలి ఎన్నికల్లో నాలుగు వేల దాకా మెజారిటీ వస్తే ఆ తరువాత ఎన్నికల్లఒ ఏకంగా 47 వేల పై దాటి వచ్చింది. 2014లో వచ్చిన ఈ మెజారితీ ఏపీలోనే రెండవ పెద్ద మెజారిటీగా రికార్డు అయింది. 2019లో సైతం పాతిక వేల ఓట్లకు పై దాటి వెలగపూడి సాధించారు. ఆయన తొలిసారి ప్రజారాజ్యం మీద మిగిలిన రెండు సార్లూ వైసీపీ మీద ఆయన విజయం సాధించారు. ఇపుడు కూడా విశాఖ తూర్పులో వైసీపీ వర్సెస్ టీడీపీగానే పోటీ ఉంది.
ఈసారి విశేషం ఏంటి అంటే జనసేన కూడా టీడీపీ కూటమిలో చేరి మద్దతు ఇవ్వడం. దాంతో ఒక విధంగా చూస్తే కనుక పటిష్టమైన స్థానంలోనే ఉంది. ఇక వెలగపూడి మూడు సార్లు నెగ్గారు కాబట్టి సహజంగానే కొంత వ్యతిరేకత ఉందని మొదట్లో భావించినా ఇపుడు దాన్ని అధిగమించి ఆయన ముందుకు సాగుతున్నారు.
వెలగపూడికి ప్లస్ పాయింట్ ఆయన అందరికీ అందుబాటులో ఉండే నేత అని. దాంతో పాటు వైసీపీలోని అసంతృప్తి నేతలు అంతా ఈ రోజున టీడీపీలో చేరి ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. 2014లో వైసీపీ నుంచి వెలగపూడి మీద పోటీ చేసి ఓడిన వంశీకృష్ణ జనసేనలో చేరారు. ఆయన క్యాడర్ అంతా వెలగపూడికి జై కొడుతోంది.
అదే విధంగా 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన అక్రమాని విజయనిర్మల సైతం టీడీపీలో చేరిపోయారు. ఆమె వర్గం కూడా వెలగపూడి విజయం కోసం పాటుపడుతోంది. ఈ ఇద్దరు నేతలు తూర్పులో బలమైన యాదవ సామాజిక వర్గం నేతలు కావడం విశేషం. ఇక రెండు సార్లు యాదవ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చిన వైసీపీ ఈసారి ఓసీకి ఇవ్వడంతో ఆ వర్గం గుర్రుగా ఉంది. దాంతో పాటుగా వైసీపీలో ఉన్న నేతల నుంచి ఆ పార్టీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణకు అనుకున్న సహకారం దక్కడం లేదు అని అంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో ఆయన దాదాపుగా ఒంటరి పోరు సాగిస్తున్నారు అని అంటున్నారు. రెండు లక్షల ఎనభై వేల పై చిలుకు ఓట్లు ఉన్న విశాఖ తూర్పులో బీసీలు నూటికి ఎనభై శాతం ఉంటారు. టీడీపీ వైసీపీ ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికే టికెట్లు ఇచ్చినా బీసీలు మాత్రం టీడీపీ పట్ల ఆకర్షితులు కావడం విశేషం. అంతే కాదు వైసీపీ లో గత అయిదేళ్ల పాటు సాగిన మూడు ముక్కలాట పోరుని ఆ పార్టీ చక్కదిద్దలేక పోయింది. దాని ఫలితంగా తూర్పులో బలంగా ఉన్న వైసీపీ ఇపుడు ఇబ్బందులు పడుతోంది అని అంటున్నారు.
హోరా హోరీ పోరుగా సాగనున్న విశాఖ తూపులో ఎవరు విజేత అన్నది మాత్రం చెప్పలేమని అంటున్నారు. అయితే వైసీపీ తో పోలిస్తే టీడీపీ సేఫ్ జోన్ లో ఉందని అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతనే తూపు తిరిగి దండం పెట్టే నేత ఎవరో తెలుస్తుంది అని అంటున్నారు.