వివేకాది హత్యకేసు... బెయిల్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు!

ఇదేసమయంలో బెయిల్‌ కోసం గంగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ కూడా వాయిదా పండిందని అంటున్నారు.

Update: 2023-07-18 11:55 GMT

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి మంజూరైన బెయిల్‌ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్‌ ను సుప్రీం కోర్టు సెప్టెంబర్‌ కు వాయిదా వేసిందని తెలుస్తుంది. ఇదేసమయంలో బెయిల్‌ కోసం గంగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ కూడా వాయిదా పండిందని అంటున్నారు.

అవును... వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ అదనపు ఛార్జ్ షీట్ లో ఎంపీ అవినాష్ రెడ్డిని ఏ-8 గా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ ను రద్దు చేయాలని వైఎస్ వివేకా కూతురు సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇదే సమయంలో గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని అతని తరుపు న్యాయవాది సుప్రీంలో పిటిషన్ వేశారు. దీంతో... ఈ రెండు పిటిషన్ లనూ సెప్టెంబర్ లో విచారించనున్నట్లు సుప్రీం తెలిపిందని తెలుస్తుంది. ఈ సమయంలో బెయిల్ పిటిషన్ విషయంలో గంగిరెడ్డి లాయర్ పై సుప్రీం కాస్త అసహనం వ్యక్తం చేసిందని అంటున్నారు.

గంగిరెడ్డికి వెంటనే బెయిల్‌ మంజూరు చేయాలంటూ.. అతడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారట. ఈ సందర్భంగా గంగిరెడ్డి న్యాయవాదిపై ధర్మాసనం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తుంది. ఈ సందర్భంగా... "ఇది హత్య కేసు.. బెయిల్‌ వ్యవహారాలు ఆచితూచి ఉంటాయి. బెయిల్‌ కోసం వేచి చూడాల్సిందే" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని అంటున్నారు.

మరోపక్క గంగిరెడ్డి పిటిషన్‌ నూ అవినాష్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కు జత చేస్తూ.. సెప్టెంబర్‌ రెండో వారంలో విచారణ చేపడతామని అత్యున్నత న్యాయస్థానం తెలిపిందని అంటున్నారు. ఇందులో భాగంగా... అవినాష్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ పై కౌంటర్‌ దాఖలుతోపాటు వివేకా హత్య కేసు వివరాలు, డైరీ సీల్డ్‌ కవర్‌ లో అందించాలని సీబీఐని సుప్రీం ఆదేశించిందని సమాచారం.

ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క తాజాగా అవినాష్ రె డ్డికి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఆగస్టు 14న కోర్టులో హాజరుకావాలని ఈ నోటీసుల్లో పేర్కొందని తెలుస్తుంది. ఇక ఈ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ... అందులో అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల పేర్లను పొందుపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని కోర్టు ముందుకు రావాలని సీబీఐ తాజాగా ఆదేశించిందని అంటున్నారు.

Tags:    

Similar News