ఉచిత బస్సు మీద ఆసక్తి ఉందా ?

ఇది ఎంతవరకూ అవసరం అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

Update: 2025-01-01 03:53 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు పధకం ఒకటి. అయితే ఈ పధకం మీద ఇప్పుడు చర్చ అయితే సాగుతోంది. ఇది ఎంతవరకూ అవసరం అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఈ పధకం వల్ల నిజంగా లబ్ది కలిగేది ఎవరికి అన్నది కూడా చూస్తున్నారు.

ఈ పధకం మహిళలకు మాత్రమే అని ప్రకటించారు. ఇక మహిళలలో చూస్తే కాలేజ్ కి వెళ్ళే విద్యార్ధినులకు వేరే బస్సులు ఉన్నాయి. దాంతో వారు ఈ బస్సుల కోసం చూసేది ఉండదు, ఇక మిగిలిన మహిళకు కూడా నిత్యం తిరిగేది కూడా సిటీలలోనే అని అంటున్నారు. ప్రైవేట్ ఉద్యోగం చేసే మహిళలకు ఈ పధకం కొంత వరకూ ఉపయోగపడుతుంది అని అనుకున్నా వారు కూడా దీని కంటే ఆర్ధిక ప్రయోజనాల మీదనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ పధకం వల్ల ఎక్కువగా బస్సులు కొని మహిళలను అందులో ప్రయాణింపచేస్తే ఆ మేరకు ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనదారులు ఇబ్బంది పడతారు. వారు తమ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని బాధ పడతారు. ఆ విధంగా కూటమి ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని అంటున్నారు.

ఇక మహిళలకు ఈ పధకం అంటూ వివక్ష ప్రదర్శిస్తే పురుషులు కూడా ఒకింత అసహనం వ్యక్తం చేసే అవకాశం ఉంది. బస్సులు కూడా పీక్ టైం లోనే ఎక్కువగా ఎక్కే వారు ఉంటారు. ఆ సమయంలో మహిళలకు రిజర్వ్ చేసే బస్సులలో పురుషులు ఎక్కలేరు కాబట్టి వారు తిట్టుకునే అవకాశాలే ఉంటాయని అంటున్నారు

ఈ పధకానికి సంబంధించి ప్రభుత్వం ఖర్చు చేసే మొత్తం ఏటా మూడు వందల కోట్ల పై దాకా ఉండొచ్చు అని ఒక అంచనా. అయితే ఈ పధకం ఏదో హామీ ఇచ్చామని అమలు చేయడం కంటే కూడా ఎక్కువ సంక్షేమం అందేలా ఇతర పధకాలలో ఏదో ఒక దానిని అమలు చేస్తే బాగుంటుందని దానిని వచ్చే స్పందన వేరుగా ఉంటుందని అంటున్నారు.

ఈ పధకం పొరుగు రాష్ట్రాలలో పెద్దగా సక్సెస్ కాలేదని వివాదాలే ఉన్నాయని కూడా అంటున్నారు పైగ భారంగా మారిందన్న చర్చ కూడా ఉంది. మరి కూటమి ప్రభుత్వం దీని మీద వరస అధ్యయనాలు చేస్తోంది. పలు దఫాలుగా అధికారులను కూడా పంపించి నివేదికలను తెచ్చుకుంది.

మొదట దసరా నుంచి ఈ పధకం అమలు అన్నారు, తరువాత సంక్రాంతి అన్నారు, ఇపుడు ఉగాది అంటున్నారు దాంతో మొదట్లో ఉన్న ఆసక్తి అయితే ఇపుడు పెద్దగా లేదని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఉగాదికి ఈ పధకం అమలు చేయాలనుకున్నా అది ఎంత మేరకు లబ్ధిదారుల నుంచి అనుకూల స్పందన అందిస్తుందో చూడాలని అంటున్నారు. అంతే కాదు ఈ పధకం వల్ల ఇతర వర్గాలు ప్రభుత్వం మీద అసంతృప్తి పెంచుకోకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అన్న దానిని కూడా పరిశీలించాల్సి ఉందని అంటున్నారు. ఉచిత బస్సు గురించి జనాలలో అయితే పెద్దగా డిమాండ్ అయితే ఇపుడు కనిపించడం లేదని అంటున్నారు.

Tags:    

Similar News