గెలుపు 'గీత' ఆపుతుందా ?
ఈ నియోజకవర్గంలో మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక గజపతిరాజుది సుధీర్ఘ రాజకీయ చరిత్ర.
విజయనగరం జిల్లాలో కీలకమైన విజయనగరం నియోజకవర్గాన్ని దక్కించుకునేందుకు ఈసారి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు సర్వశక్తులు ఒడ్డాయి. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ, వైసీపీలు మాత్రమే బరిలో ఉండగా ఈసారి టీడీపీ రెబల్ బరిలో దిగడం అది ఎవరి మీద ప్రభావం చూపుతుంది అన్న చర్చ నడుస్తుంది.
ఈ నియోజకవర్గంలో మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక గజపతిరాజుది సుధీర్ఘ రాజకీయ చరిత్ర. విజయనగరం రాజ కుటుంబం తరపున రాజకీయాల్లో ఆయనది క్లీన్ ఇమేజ్. 2019లో అశోక్ గజపతి రాజు ఎంపిగా పోటీచేయడంతో ఆయన కుమార్తె అదితి గజపతి రాజుఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకుని 2019లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మరోసారి టికెట్ దక్కించుకుని ఆమె పోటీలో నిలబడ్డారు.
2014లో అశోక గజపతిరాజు ఎంపీగా పోటీ చేయడంతో అప్పుడు మీసాల గీత టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుండి గెలిచిన కోలగట్ల వీరభద్రస్వామి గెలిచి డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్నాడు. కోలగట్ల రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశాడు.
గత ఎన్నికల్లో కేవలం 5 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైన అదితి విజయలక్ష్మి ఈసారి గెలుపుకోసం తీవ్రంగా కృషిచేసింది. ఈసారి టీడీపీ టికెట్ కోసం తీవ్రప్రయత్నాలు చేసిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత రెబెల్ గా పోటీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ స్థానంలో గెలుపు ఎవరిది అన్న ఉత్కంఠ నెలకొంది.