ఎన్నికలకు ముందు వైసీపీకి భారీ బూస్ట్.. !
ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలనే కసితోఉన్న వైసీపీ.. ఆదిశ గా అడుగులు ముమ్మరం చేసింది.
ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలనే కసితోఉన్న వైసీపీ.. ఆదిశ గా అడుగులు ముమ్మరం చేసింది. ఒకవైపు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు వేస్తున్న వ్యూహాలను పసి గడుతూ.. వాటికి అనుగుణంగా మరిన్ని వ్యూహాలను కూడా పార్టీ రెడీ చేస్తోంది. ఇక, రెండో వైపు అభ్యర్థుల ఎంపికలోనూ ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఎక్కడా రాజీలేని ధోరణితో వైసీపీ ముందుకు సాగుతోంది. ఇక, ఇదే సమయంలో అభ్యర్థులను కూడా ఖరారు చేస్తోంది.
ఇక, వీటికితోడు.. ఇప్పుడు ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలను కూడా వైసీపీ మరింత ముమ్మ రం చేసింది. గత నాలుగేళ్లుగా తీవ్ర వివాదంగా మారి.. ప్రతిపక్షాల విమర్శల వేడికి కేంద్రంగా ఉన్న రా ష్ట్రంలోని టిడ్కో ఇళ్లను లబ్ధిదారులను అందజేయాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇళ్ల నిర్మాణాలు దాదాపు 85 శాతం పూర్తయ్యాయి. మౌలిక సదుపాయాలైన కరెంటు.. తాగునీటి వసతి, చిన్న పాటి రహదారులను నిర్మించాల్సి ఉంది.
వీటిని పూర్తి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. విపక్షాల విమర్శలకు ఎక్కడా తలొగ్గకుండా.. ముందుకు సాగు తోంది. ఈ క్రమంలో తాజాగా అన్ని జిల్లాల్లోనూ మౌలిక సదుపాయాలను కూడా కల్పించిన 30 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. వచ్చే జనవరి తొలి వారంలోనే సం క్రాంతి కానుకగా ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. జనవరిలో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం జగన్ వీటిని లబ్ధిదారులకు అందించనున్నారు.
ఇక, ఇప్పటి వరకు విశాఖ, విజయనగరం, నెల్లూరు, గుంటూరు, చిత్తూరు, పార్వతీపురం మన్యం, కర్నూ లు, అనకాపల్లి నియోజకవర్గాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా పూర్తియింది. దీంతో ఎన్నికలకు ముందు వీటిని పంపిణీ చేయడం ద్వారా.. వైసీపీపై ప్రజల్లో మరింత విశ్వసనీయత పెరుగుతుందని.. మరింత బూస్ట్ గా మారుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.