మెగాస్టార్ కి వైసీపీ తొలి షాక్....?

ఇక ఏదైనా సినిమా టికెట్ల ధరలు పెంచుకోవాలంటూ 20 శాతం షూటింగ్ ఏపీలో జరిగినట్టు ఆధారాలను ఇవ్వాలనే నిబంధనను కూడా ప్రభుత్వం పెట్టింది.

Update: 2023-08-10 09:00 GMT

ఏపీ ప్రభుత్వం నుంచి మెగాస్టార్ చిరంజీవికి తొలి షాక్ తగలనుందా అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. మెగాస్టార్ నటించిన భోళా శంకర్ మూవీకి ఏపీలో టికెట్ల పెంపు విషయం ఇష్యూ గా మారనుందా అన్నది చర్చలు వస్తోంది. అసలు భోళా శంకర్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఎందుకు మారింది అన్నది ఆలోచిస్తే చాలా విషయాలు కనిపిస్తాయి.

భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆది అనే జబర్దస్త్ కమెడియన్ మెగా స్టార్ ని పొగుడుతూ కొన్ని రాజకీయ విమర్శలు చేశారు. వైసీపీని డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. మామూలుగా చిరంజీవి రాజకీయాలను దూరంగా పెడతారు. కానీ ఆది అన్నదమ్ముల అనుబంధం అంటూ చెప్పబోతూ ఏపీ ప్రభుత్వం మీద ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కొన్ని సెటైర్లు వేశారు.

ఆది చెప్పాల్సింది భోళా శంకర్ మూవీ గురించి అయితే దాన్ని పక్కన పెట్టి చాలానే మాట్లాడారు అని అంటున్నారు. అది వైసీపీకి ఒక షాక్ అయితే ఆ తరువాత రోజు చిరంజీవి నేరుగా వైసీపీ ప్రభుత్వం మీద అటాక్ చేశారు. ఆయన అన్న మాటలతో మంట రాజుకుంది. అది కాస్తా చివరికి ఎంతదాకా వెళ్తుందో అన్నది తెలియదు కానీ ఇపుడు భోళా శంకర్ సినిమాకు ఏపీలో టికెట్లు పెంచుతారా లేదా అన్నది చర్చకు వస్తోంది. కొద్ది గంటలలో సినిమా రిలీజ్ ఉంటే టికెట్ల రేటు పెంపు వ్యవహారం పీటముడిగా మారుతోంది అని అంటున్నారు.

ఈ మూవీకి సంబంధించి అనుమతికి కావాల్సిన 11 డాక్యుమెంట్లను నిర్మాతలు ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి చిత్ర నిర్మాణ వ్యయానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని తెలిపినట్లుగా భోగట్టా. అదే విధంగా అధిక సినిమా రేట్ల పెంపుకు సంబంధించి ఒక సినిమా నిర్వాహకులు అయితే నెల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.

అయితే భోళా శంకర్ చిత్ర నిర్మాతలు గత ఏడాది ఐటీ ప్రూఫ్స్, జీఎస్టీ వివరాలు ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇక ఏదైనా సినిమా టికెట్ల ధరలు పెంచుకోవాలంటూ 20 శాతం షూటింగ్ ఏపీలో జరిగినట్టు ఆధారాలను ఇవ్వాలనే నిబంధనను కూడా ప్రభుత్వం పెట్టింది.

ఇలా పెండింగ్ డాక్యుమెంట్లను ఇవ్వాలని నిర్మాతలకు సూచించింది. అయితే చిత్ర నిర్మాతలు ఇంతవరకు స్పందించలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతిస్తుందా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి మాటలను బట్టి చూస్తే అంతా పారదర్శకంగానే టికెటింగ్ విధానం ఉందని అంటున్నారు.

అందువల్ల సంబంధిత డాక్యుమెంట్లను తీసుకుని ఎవరైనా వస్తే వారికి టికెట్ల రేట్లు పెంపు ఉంటుందని స్పష్టం చేస్తున్నాట్లుగానే ఉంది. మరి కొద్ది గంటలలో రిలీజ్ పెట్టుకున్న భోళా శంకర్ మూవీ విషయంలో ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే మెగాస్టార్ చాలా కాలానికి రాజకీయ విమర్శలు చేశారు. వాటిని ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది అని అంటున్నారు. మెగాస్టార్ ని వైసీపీ అధినాయకత్వం గౌరవించిందని, సినీ పెద్దగా చూసిందని, ఆయన ఇలా మాట్లాడమేంటి అని అంటున్నారు. అందువల్ల చిరంజీవికి తొలి షాక్ వైసీపీ నుంచి ఎదురవుతుందని అంటున్నారు.

ఆ మీదట చిరంజీవి ఎలా రియాక్ట్ అయినా అది పొలిటికల్ వైపుగా రీ ఎంట్రీ అంటూ అడుగులు వేసినా వైసీపీ ఉభయతారక వ్యూహంతోనే ముందుకు సాగుతోంది అని అంటున్నారు. ఏపీలో ఇప్పటికే టీడీపీ జనసేనల మధ్యన పొత్తులు కుదరడానికి అనేక అవరోధాలు ఉన్నాయి. ఇపుడు మెగా ఎంట్రీ ఇస్తే అది మరింత సంక్లిష్టంగా మారడం ఖాయం. బహుశా చాలా వ్యూహాలతో వైసీపీ మెగాస్టార్ విషయంలో వేరే ఆలోచనలు చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News