హై లెవెల్ ఓల్టేజ్ తో వైసీపీ ట్రైలర్ ..... ఫుల్ సినిమా చుక్కలేనా...?
వైసీపీ బస్సు యాత్ర గురించి చెబుతూ రూపొందించిన ఈ ట్రైలర్ మొత్తం రెండు నిముషాల నాలుగు సెకండ్లు ఉంది. ఇది భారీ సినిమా ట్రైలర్ ని మించి ఉంది.
వైసీపీ వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు సాగుతోంది. దానికి ఇదే తగిన సమయం అని కూడా భావిస్తోంది. విపక్షం టోటల్ గా డీ మోరలైజ్ అయిన వేళలో వైసీపీ కదం తొక్కుతూ జనంలోకి వెళ్తోంది. ఈ నెల 26 నుంచి అంటే దసరా సందడి ముగిసిన మరుసటి రోజు నుంచే వైసీపీ ప్రజల వద్దకు వెళ్తోంది. దానికి సామాజిక బస్సు యాత్ర పేరు పెట్టింది.
ఈ సామాజిక బస్సు యాత్రకు సంబంధించిన ట్రైలర్ ని వైసీపీ తాజాగా రిలీజ్ చేసింది. దాన్ని వైసీపీ ఎస్ వేదికగా షేర్ చేసింది. వైసీపీ బస్సు యాత్ర గురించి చెబుతూ రూపొందించిన ఈ ట్రైలర్ మొత్తం రెండు నిముషాల నాలుగు సెకండ్లు ఉంది. ఇది భారీ సినిమా ట్రైలర్ ని మించి ఉంది. టోటల్ గా వైసీపీ మొత్తం పాలన గురించి. ఆ పార్టీ సామాజిక న్యాయం గురించి, ఆ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ ట్రైలర్ లో పూర్తిగా వివరించారు.
పేదల సంక్షేమం కోసం వైసీపీ తన పాలనలో ఏమి చేసింది అన్నది ఇందులో పొందుపరచారు. నా ఎస్సీ నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ జగన్ నినదించిన వాయిస్ ఆయన పలు సభలలో మాట్లాడిన స్పీచెస్ ని కట్ చేస్తూ ట్రైలర్ ని ఇంటరెస్టింగ్ గా తీర్చిదిద్దారు. సామాజిక న్యాయం అంటే అసలైన అర్ధం ఏంటో కూడా ఈ ట్రైలర్ లో చెబుతూ వచ్చారు.
దీన్ని చూస్తూంటే ట్రైలరే ఇలా ఉంటే ఇక వైసీపీ చూపించబోయే సినిమా ఏ రేంజిలో ఉంటుందో అన్న ఉత్కంఠను పెంచేలా ఉంది అని అంటున్నారు. ఈ నెల 26 నుంచి జనంలోకి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టోటల్ ప్రజా ప్రతినిధులు అంతా వెళ్లబోతున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఒక్క సభ జరిగేలా రోజుకు మూడు సభలతో మొత్తం రెండు నెలలలో నెలలలో ఈ బస్సు యాత్రను పూర్తి చేయడానికి వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది.
ఏపీలో ఈ సామాజిక బస్సు యాత్రలో మంత్రి మొదలుకుని సర్పంచ్, వార్డు మెంబర్ దాకా అందరికీ కనెక్ట్ చేస్తూ టోటల్ పార్టీ కదిలే విధంగా రూపొందించారు. సామాజిక బస్సు యాత్ర అన్నది వైసీపీ పొలిటికల్ యాక్షన్ లో అత్యంత కీలకంగా మారబోతోంది అని అంటున్నారు. తాము ప్రజలకు ఏమి చేసామని జనరల్ పబ్లిక్ కి ఒక వైపు చెబుతూనే ఫలానా సెక్షన్లకు తాము ఎంత చేశాం ఏ ఏ వర్గాలు వైసీపీ పాలనలో బాగుపడ్డాయన్నది పర్టిక్యులర్ గా ఆ వర్గాల వద్దకు వెళ్ళి మరోసారి తెలియచేయడం ద్వారా టోటల్ గా అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకునే ఎత్తుగడ ఉంది అని అంటున్నారు.
విపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఏమీ చేయలేదు అని చెబుతున్న వేళ వైసీపీ మాత్రం సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ కి తెర తీస్తూ ఆయా వర్గాలకు మరింత చేరువ కావడానికి చూస్తోంది. దాంతో వైసీపీ వై నాట్ 175 టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఇది ఒక దగ్గర దారిగా భావిస్తోంది. అందులో భాగంగా ఇటు క్యాడర్ కి అటు జనానికీ కూడ ఉత్తేజం చేసేలా ట్రైలర్ ని ఇంటరెస్ట్ పెంచుతూ కట్ చేసి వదిలారు. ఇదిపుడు ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారుతోంది. మరి ఈ ట్రైలర్ ని చూస్తేనే ఇలా హై లెవెల్ ఓల్టేజ్ తో ఉంటే ఫుల్ సినిమా ఎలా ఉంటుంది అన్నదే ఇపుడు వైసీపీతో పాటు అందరిలోనూ ఆసక్తిని పెంచుతున్న అంశం.