ఐ ప్యాక్ కి వైసీపీ టాటా చెప్పేసినట్లేనా ?
ఇక ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా వైసీపీ అధినాయకత్వం ఐ ప్యాక్ ని నమ్మింది. 2029 ఎన్నికల కోసం స్ట్రాటజీస్ రూపొందించాలని కూడా కోరింది.;
ఐ ప్యాక్ అన్న ఎన్నికల వ్యూహరచన వ్యవస్థ వైసీపీకి పనిచేస్తోంది. 2017 నుంచి దాదాపుగా ఎనిమిదేళ్ళ పాటు ఈ వ్యవస్థ వైసీపీని అట్టిపెట్టుకుని ఉంది. ఒక అద్భుత విజయం ఒక ఘోర పరాజయం వైసీపీకి ఐ ప్యాక్ వల్ల లభిచాయి. అద్భుతం విజయం లభించినపుడు ఐ ప్యాక్ వెంట ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నారు. అందువల్లనే 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు దక్కాయి.
కానీ 2019 తరువాత పీకే తప్పుకున్నారు. ఐ ప్యాక్ బాధ్యతలను రిషి రాజ్ సింగ్ తీసుకున్నారు. ఆయన నాయకత్వంలోనే అయిదేళ్ళ పాటు వైసీపీకి ఐ ప్యాక్ పనిచేసింది. అయితే ఫలితం ఎంత దారుణంగా వచ్చిందో అందరూ చూశారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని పట్టుకోవడంలో ఐ ప్యాక్ విఫలం అయింది అని ఫలితాలు రుజువు చేశాయి. వైసీపీకి ఎదురులేదు తిరుగులేదంటూ నివేదికలు ఇవ్వడంతోనే అధినాయకత్వం అప్రమత్తం కాకుండా ధీమాకు పోయిందని ఫలితంగా దారుణ పరాజయం మూటకట్టుకుందని అంటున్నారు.
ఇక ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా వైసీపీ అధినాయకత్వం ఐ ప్యాక్ ని నమ్మింది. 2029 ఎన్నికల కోసం స్ట్రాటజీస్ రూపొందించాలని కూడా కోరింది. దాంతో ఒప్పందాలను మరోసారి పొడిగించారని అంటున్నారు. అయితే ఐ ప్యాక్ వల్ల మేలు లేదని ఇబ్బందులే అని పార్టీ వర్గాల భావనగా ఉంది. కానీ హైకమాండ్ పూర్తి విశ్వాసం ఉంచి ఐ ప్యాక్ సేవలని కంటిన్యూ చేసింది.
ఇదిలా ఉంటే గ్రౌండ్ లెవెల్ లో టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మీద ప్రజల అలోచనలు ఎలా ఉన్నాయి, దానికి అనుగుణంగా వైసీపీ ఏ విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలి అన్నది అప్పచెప్పిన బాధ్యతగా చెబుతున్నారు. కానీ ఐప్యాక్ టీం ఈ విషయంలో ఫెయిల్ అయింది అని ప్రచారం సాగుతోంది.
కేవలం తొమ్మిది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని ఐప్యాక్ టీఎం నివేదికలు ఇచ్చిందని అంటున్నారు. అయితే అవన్నీ నిజాలు కావని తాజా రాజకీయాలు నిరూపించాయి. పైగా కొత్త ప్రభుత్వం మీద అంత తొందరగా ప్రజా వ్యతిరేకత రాదని అర్ధం అయింది అని అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే గ్రౌండ్ లెవెల్ రిపోర్టులకు అయి ప్యాక్ ఇస్తున్న నివేదికలకు మధ్య తేడా వస్తోందని అధినాయకత్వం గ్రహించింది అని అంటున్నారు. దాంతో ఐ ప్యాక్ కి ప్యాకప్ చెప్పిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు తెలుసుకోకుండా జగన్ జనంలోకి వెళ్తే వచ్చే మైలేజ్ ఏమీ రాదు అని అంటున్నారు.
పైగా ఇప్పటికిపుడు ఎన్నికలు లేవని అంటున్నారు. ప్రభుత్వం చేసే తప్పులను పార్టీ వర్గాల ద్వారా ఎప్పటికపుడు ఎండగడుతూ నెమ్మదిగా జనంలో ఒక చర్చ పెట్టాలని ఆ తర్వాత కూటమి పట్ల జనాలకు వ్యతిరేకత వస్తే అపుడు అధినాయకత్వం జనంలోకి వెళ్ళినా ఉపయోగం ఉంటుందని అంటున్నారు.
లాజికల్ గా చూసినా నేచురల్ గా చూసినా ఇంత చిన్న మ్యాటర్ ని ఐ ప్యాక్ మిస్ అయినట్లుగా ఉందని అంటున్నారు. దాంతోనే రియలైజ్ అయిన హైకమాండ్ ఐ ప్యాక్ కి టాటా చెప్పేసింది అని అంటున్నారు. ఈ పరిణామం పట్ల వైసీపీ వర్గాలలో హర్షం అయితే వ్యక్తం అవుతోంది. ఐ ప్యాక్ వల్లనే వైసీపీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు అయింది అని పార్టీలో చర్చ అయితే ఉంది.
అలాంటి వారి సేవలను కొనసాగించవద్దు అని అంతా చెబుతూ వచ్చారు. మొత్తానికి చివరికి పార్టీకి మంచే జరిగిందని అంటున్నారు. చూడాలి మరి ఐ ప్యాక్ ప్లేస్ లోకి మరో సంస్థ వస్తుందా లేక ఇప్పుడు ఉన్న అనుభవంతో అధినాయకత్వమే స్వయంగా నిర్ణయాలు తీసుకుని జనాలకు చేరువ అవుతుందా అన్నది.