అమెరికాలో భరించలేక ఇండియాకొచ్చి గొప్పగా సెటిలైన అమెరికన్ యువకుడి కథ!

అమెరికాలో విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో విసిగిపోయిన ఒక అమెరికన్ తొమ్మిదేళ్ల క్రితం భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు.;

Update: 2025-03-21 15:26 GMT

అమెరికాలో విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో విసిగిపోయిన ఒక అమెరికన్ తొమ్మిదేళ్ల క్రితం భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. తన వ్యాపారాన్ని ఇక్కడే ప్రారంభించి ఒక భారతీయ మహిళను వివాహం చేసుకుని గోవాలో నివసిస్తున్నాడు. ఇప్పుడు నెలకు ₹1 లక్ష లోపు ఖర్చుతో ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పుకొచ్చాడు. అమెరికా కంటే ఇండియా అన్ని విధాలా బెస్ట్ అంటూ చెప్పుకొస్తున్నాడు.

ఎల్లియట్ రోసెన్‌బర్గ్ అనే ఈయన తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో 12 సంవత్సరాల క్రితం తాను తీసుకున్న ఒక అరుదైన ఆర్థిక నిర్ణయం తన జీవితాన్నే మార్చివేసిందని తెలిపారు. చాలామంది ఆర్థిక నిపుణులు ఖర్చులను తగ్గించుకోవడం, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం, అనేక ఆదాయ మార్గాలను ఏర్పరచుకోవడం వంటి సలహాలు ఇస్తుంటారని.. తద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి త్వరగా పదవీ విరమణ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఉన్నప్పుడు అధిక ద్రవ్యోల్బణం కారణంగా జీవించడం చాలా ఖరీదైనదిగా అనిపించిందని ఆయన అన్నారు. "ద్రవ్యోల్బణం చెడ్డదే, కానీ జీవనశైలిని పెంచుకుంటూ పోవడం దానికంటే దారుణం" అని ఆయన వ్యాఖ్యానించారు.

‘అమెరికాలో స్నేహితులను కోల్పోకుండా ఉండాలంటే ఖరీదైన రెస్టారెంట్‌లకు వెళ్లాలి. సంగీత కచేరీలకు హాజరు కావాలి.. షాపింగ్‌కు వెళ్లాలి.. ఇవన్నీ కూడా వాటిపై డబ్బు ఖర్చు చేయాలనే సామాజిక ఒత్తిడి అమెరికాలో ఎక్కువగా ఉంటుంది’ అని ఆయన వివరించారు. ఈ ఒత్తిడి కారణంగానే తాను అమెరికాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మొదట బ్రెజిల్ , ఇతర దక్షిణాసియా దేశాలకు ప్రయాణించిన తరువాత చివరకు భారతదేశంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు..

"నేను ఇక్కడే నా భార్యను కలిశాను. ఆమె కుటుంబంతో సన్నిహితంగా మెలిగాను. హిందీ నేర్చుకున్నాను. జీవితాంతం నిలిచిపోయే బంధాలను ఏర్పరచుకున్నాను. 2 వ్యాపారాలను ప్రారంభించాను" అని ఆయన తన పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం తాను గోవాలో నివసిస్తున్నానని.. తన కుటుంబంతో సౌకర్యవంతంగా నెలకు ₹1 లక్ష కంటే తక్కువ ఖర్చుతో ఎంతో హాయిగా ఉంటున్నట్లు లింక్ ఇన్డ్ పోస్ట్ లో పేర్కొన్నారు. అమెరికా కంటే ఇండియా బెటర్ అన్నా ఆ యువకుడి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

-సోషల్ మీడియా ఏమంటోంది?

రోసెన్‌బర్గ్ కథనాన్ని చదివిన నెటిజన్లు ఆయన ధైర్యాన్ని, సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఒక వ్యక్తి స్పందిస్తూ "మీరు రిస్క్ తీసుకోవడానికి.. సాహసోపేతంగా ఉండటానికి చూపిన ఆకలిని నేను ఇష్టపడ్డాను... అది మీకు మంచి ఫలితాలను ఇచ్చింది .. మీరు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ కథను పంచుకున్నందుకు ధన్యవాదాలు" అని కామెంట్ చేశారు.. మరొకరు, "ఆరోగ్యకరమైన , సురక్షితమైన జీవితానికి భారతదేశం చాలా మంచిదని తెలుసుకోవడం సంతోషంగా ఉంది" అని వ్యాఖ్యానించారు.

రోసెన్‌బర్గ్ తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత వర్జీనియా విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ , లాటిన్ అమెరికన్ స్టడీస్‌లో రెండవ మేజర్ పట్టా పొందారు. తన కెరీర్‌లో భాగంగా ఇండియాకు వచ్చి రెండు కంపెనీలను స్థాపించి ఇక్కడే గోవాలో సెటిల్ అయ్యారు.

Tags:    

Similar News