ఫ్రొఫెసర్ కాదు.. కామాంధుడు.. విద్యార్థినులతోనే ఆ పని

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో ఒక గురువు తన విద్యార్థినుల పట్ల అత్యంత నీచంగా ప్రవర్తించాడు.;

Update: 2025-03-21 15:39 GMT

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో ఒక గురువు తన విద్యార్థినుల పట్ల అత్యంత నీచంగా ప్రవర్తించాడు. రజనీష్ కుమార్ అనే జియాలజీ ప్రొఫెసర్ పరీక్షల్లో మంచి మార్కులు వేస్తానని.. ఒప్పుకోకుంటే ఫెయిల్ చేస్తానని బెదిరించి చాలా మంది విద్యార్థినులను లైంగికంగా లోబర్చుకున్నాడు. అతను ఆ దుశ్చర్యలన్నింటినీ వీడియో తీసి తన ఫోన్‌లో భద్రంగా దాచుకున్నాడు. కానీ ఎట్టకేలకు అతని పాపం పండింది.

హథ్రాస్‌లోని ఒక కళాశాలలో పనిచేస్తున్న రజనీష్ కుమార్ అనే ప్రొఫెసర్‌పై ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక విద్యార్థిని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు కాగానే ప్రొఫెసర్ పరారయ్యాడు. పోలీసులు వెంటనే అతడి కోసం గాలించి ప్రయాగ్‌రాజ్‌లో పట్టుకున్నారు.

- ఒక విద్యార్థిని ఫిర్యాదుతో బయటపడ్డ భయంకరమైన నిజాలు

అప్పటివరకు ఆ ప్రొఫెసర్ ఒక్క విద్యార్థినినే వేధించాడని అందరూ అనుకున్నారు. కానీ పోలీసులు అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అసలు విషయం బయటపడింది. ఆ ఫోన్‌లో అతను లైంగికంగా వేధించిన విద్యార్థినుల వీడియోలు వందల సంఖ్యలో ఉన్నాయి.

- 2009 నుండి చాలా మందిని విద్యార్థినులపై లైంగిక దాడి

సేఠ్ ఫూల్‌ చంద్ బాగ్లా పీజీ కళాశాలలో పనిచేస్తున్న రజనీష్ కుమార్ 2009లో మొదటిసారి ఒక విద్యార్థినిని లోబర్చుకున్నాడు. మంచి మార్కులు వేస్తానని నమ్మించి ఆమెపై లైంగిక దాడి చేశాడు. అంతేకాదు ఆ దృశ్యాన్ని వెబ్‌ కెమెరాలో రికార్డు కూడా చేశాడు. ఆ వీడియోను చూపిస్తూ ఆ అమ్మాయిని చాలా కాలం పాటు బెదిరించాడు. ఆ తర్వాత ఇదే పద్ధతిలో తన వలలో చిక్కిన ప్రతి విద్యార్థినిని లైంగికంగా వేధించి రికార్డు చేయడం మొదలుపెట్టాడు. తమ పరువు పోతుందని భయపడి చాలా మంది విద్యార్థినులు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోయారు.

-పెళ్లయినా ఆగని వికృత చేష్టలు

ఈ ప్రొఫెసర్ విద్యార్థులకు పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుండి, వారి తల్లిదండ్రుల నుండి డబ్బులు కూడా వసూలు చేశాడు. లైంగిక దాడి దృశ్యాలను రికార్డు చేయడానికి అతడు తన కంప్యూటర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడికి 1996లో వివాహం జరిగింది, కానీ ప్రస్తుతం అతని వైవాహిక జీవితం సక్రమంగా లేదు, వారికి పిల్లలు కూడా లేరు. పోలీసులు ఈ నీచమైన గురువును అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

Tags:    

Similar News