35 ఏళ్ల శిక్ష విధించి..419 కోట్ల నష్టపరిహారం ఇప్పించిన కోర్టు..

వెయ్యి మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని అంటారు.

Update: 2024-09-11 06:30 GMT

వెయ్యి మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని అంటారు. న్యాయవ్యవస్థ నిర్దోషులకు శిక్ష పడకుండా.. దోషులను శిక్ష నుంచి తప్పించుకోకుండా పరిరక్షిస్తుంది. మరి అలాంటి న్యాయవ్యవస్థ వల్లే చిన్న తప్పు జరిగి అన్యాయంగా ఒక వ్యక్తికి శిక్ష పడితే.. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ సంఘటన నిజంగా చోటుచేసుకుంది. ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించాడు అని తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తిని విడుదల చేసిన కోర్టు ఏకంగా అతనికి 50 మిలియన్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.

ఈ ఆశ్చర్యకరమైన సంఘటన చికాగో ఫెడరల్ జ్యూరీ కోర్టులో చోటు చేసుకుంది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడు అనే అభియోగంపై ఓ వ్యక్తి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. అయితే ఆ తర్వాత అతను ఏ తప్పు చేయలేదు అన్న విషయం రుజువయింది.మార్సెల్ బ్రౌన్ అనే వ్యక్తిని హత్యా నేరంలో 2008లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అప్పట్లో జరిగిన విచా రణలో న్యాయస్థానం అతని దోషిగా నిర్ణయించి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

అయితే 2018లో అప్పట్లో అతనితో బలవంతంగా నేరం అంగీకరించేలా చేశారు అంటూ బ్రౌన్ తరఫున న్యాయవాదులు కోర్టుకి సాక్షాధారాలను సమర్పించారు. దీంతో న్యాయస్థానం అతనిపై నమోదైన కేసును కొట్టివేస్తూ అతని విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన బ్రౌన్ తనపై తప్పుడు కేసు పెట్టి జైలులో బంధించారని.. తనకు న్యాయం చేయాల్సింది అని కోరుతూ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

గత కొద్దికాలం గా ఈ విషయంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా చికాగో ఫెడరల్ కోర్టు కొన్ని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు కేసులో నిర్దోషి అయిన బ్రౌన్ ను అరెస్టు చేసి పది సంవత్సరాల పాటు అన్యాయంగా అతన్ని జైలు నాలుగ గోడల మధ్య శిక్ష అనుభవించేలా చేసినందుకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు కేసు పెట్టినందుకు 10 మిలియన్ల డాలర్లు.. 10 సంవత్సరాలు పాటు జైలు శిక్ష అనుభవించేలా చేసినందుకు మరో 40 మిలియన్ డాలర్లు అంటే మొత్తం అతడికి 50 మిలియన్ డాలర్లు( రూ.419కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.కోర్టు తీర్పు పై హర్షం వ్యక్తం చేసిన బ్రౌన్ ఇన్నాళ్లకు తనకు, తన కుటుంబానికి న్యాయం జరిగిందని పేర్కొన్నారు.

Tags:    

Similar News