అమెరికాలో భారతీయులే రిచ్.. చెల్లిస్తున్న పన్ను ఎంతో తెలుసా..!

అగ్రదేశం అమెరికాలో భారతీయులు సత్తాచాటుతున్నారు. సంఖ్యా పరంగా చూస్తే అమెరికా జనాభాలో భారతీయులు ఒక్క శాతం మాత్రమే.

Update: 2024-11-04 07:27 GMT

అగ్రదేశం అమెరికాలో భారతీయులు సత్తాచాటుతున్నారు. సంఖ్యా పరంగా చూస్తే అమెరికా జనాభాలో భారతీయులు ఒక్క శాతం మాత్రమే. కానీ.. ఆ దేశం అభివృద్ధిలో భారత సంతతి వారే కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు.. అగ్రరాజ్యంలో భారతీయులే రిచ్ పీపుల్‌గా నిలవడం మరింత విశేషం. జనాభా ఒక్క శాతమే అయినప్పటికీ.. భారతీయులు 6 శాతం పన్ను చెల్లిస్తున్నారు.

దేశం ఏదైనా భారతీయుల ప్రతిభాపాటవాలతో అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఇచ్చిన కమిట్‌మెంట్ ప్రకారం పనులు చేస్తూ అందరితో శెభాష్ అనిపించుకోవడం తెలిసిందే. అందులోనూ అమెరికాలోనూ మనోళ్ల పాపులారిటీ అంతాఇంతా కాదు. అక్కడ ఎక్కువ సంపాదిస్తున్నది కూడా మనోళ్లే కావడం విశేషం.

అమెరికాలో ప్రస్తుతం 40 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నట్లు అక్కడి లెక్కలు చెబుతున్నారు. వీరిలో 16 లక్షల మంది వీసా హోల్డర్లు కాగా.. 14 లక్షల మంది న్యూట్రలైజ్డ్ రెసిడెంట్లు ఉన్నారు. మరో 10 లక్షల మంది అక్కడే జన్మించిన వారు ఉన్నారు. అయితే.. అమెరికాకు వెళ్లిన భారతీయులు రకరకాల రంగాల్లో స్థిరపడ్డారు. సాఫ్ట్‌వేర్, నాసా, డాక్టర్లు.. ఇలా చాలా రంగాల్లోనూ భారతీయులు సేవలందిస్తున్నారు. యూఎస్‌లో 79శాతం మంది ఇండియన్లు కాలేజీ గ్రాడ్యుయేట్లు కాగా.. ఇది దేశ సగటు 34శాతం కంటే రెట్టింపు. ఇక.. భారత కుటుంబ మధ్యస్థ ఆదాయం 1,23,700 డాలర్లు కాగా.. ఇది దేశ సగటుకు రెండింతలుగా ఉంది. అలాగే.. మధ్యస్థ ఆదాయంలో తైవాన్, ఫిలిప్పీన్స్ కుటుంబాలు తరువాతి స్థానంలో నిలిచాయి. అలాగే.. మనవాళ్ల నెలవారీ ఆదాయాలు కూడా అమెరికన్ల కంటే ఎక్కువనే ఉన్నాయి. 2019 నుంచి 2023 మధ్య సగటు భారతీయ కుటుంబ ఆదాయం 24 శాతం పెరిగితే.. అమెరికన్ల ఆదాయం 18 శాతమే పెరిగింది.

అమెరికా సెన్సస్ బ్యూరో, కార్సెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ ప్రకారం.. 2019, 2023లో వివిధ దేశాల ఆదాయ వివరాలను వెల్లడించారు. 2019లో భారతీయుల ఆదాయం 1,26,705 డాలర్లుగా ఉంటే.. 2023కు వచ్చేసరికి.. 1,57,005కు పెరిగింది. ఫిలిప్పీన్స్ దేశస్తుల ఆదాయం 2019లో 1,00,273 డాలర్లు కాగా.. 2023లో 1,12,874 డాలర్లుగా ఉంది. చైనీయుల ఆదాయం 2019లో 86,281 డాలర్లు కాగా.. 2023లో 1,05,393కు చేరింది. అలాగే.. మొత్తం అమెరికన్ల ఆదాయం 2019లో 65,712 కాగా.. 2023లో 77,719కు చేరింది. దీనిని బట్టి చూస్తే భారతీయుల ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే.. భారతీయులు ఇంత టాప్‌లో ఉండడానికి కారణాలను గురించి గతంలో అమెరికా చట్టసభల్లో రిచ్ మెక్‌కార్మిక్ ప్రశంసించారు. భారతీయులు విద్యకు ప్రాధాన్యత ఇస్తారని, చాలా కష్టపడి పనిచేస్తారని తెలిపారు. చాలా తెలివైన వారని కూడా కొనియాడారు. అత్యధిక వేతనాలు లభించే ఐటీ, ఇంజినీరింగ్, వైద్య రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. తమ ప్రాంతంలో ప్రతీ ఐదుగురిలో ఒక వైద్యుడు భారతీయుడే అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News