యూఎస్ లో రోడ్డుపై భారత సంతతి వ్యక్తి కాల్చివేత... వీడియో!
అమెరికాలో రోజు రోజుకీ పెరుగుతున్న తుపాకీ కల్చర్ తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
అమెరికాలో రోజు రోజుకీ పెరుగుతున్న తుపాకీ కల్చర్ తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఏ చిన్న సమస్య వచ్చినా దానికి సమాధానం తుపాకీ తూటా అన్నట్లుగా పరిస్థితులు మరిపోతున్నాయనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఇటీవల యూఎస్ మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పై కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
ప్రధానంగా వీకెండ్ పార్టీస్ లోనూ, మత్తులో ఉన్న ఆవేశపరులు తీసుకునే నిర్ణయాల్లోనూ తుపాకీ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఎప్పుడైతే ప్రతీ సమస్యకూ, ప్రతీ వాగ్వాదానికీ తుపాకీ తూటానే కన్ క్లూజన్ అని భావిస్తే పరిస్థితులు మరింత సంక్షిష్టంగా మారిపోతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగడంతో తుపాకీ పేలిన ఘటన తెరపైకి వచ్చింది.
అవును... అమెరికాలో ఇటీవల భారతీయులు, భారత సంగతి వ్యక్తులు వరుసగా దాడులకు గురవుతుండటం, పలు సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతుండటం వంటి ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా భారత సంతతి వ్యక్తిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు.
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన గావిన్ దసౌర్ (29) కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో మెక్సికోకు చెందిన ఓ యువతితో రెండు వారాల క్రితమే గావిన్ కు వివాహం అయ్యింది. ఈ క్రమంలోనే భార్యతో కలిసి సరదాగా బయటకు వెళ్తుండగా.. కారు ప్రమాదం జరిగింది. ఈ సమయంలో గావిన్ తన వద్ద ఉన్న తుపాకీ తీసుకుని కారు నుంచి దిగాడు.
ఈ సమయంలో.. వెనుక వాహనంంలో ఉన్న డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. ఇలా మాటా మాటా పెరగడంతో... ఆగ్రహానికి గురైన ఆ డ్రైవర్ తన వద్ద ఉన్న తుపాకీతో గావిన్ దసౌర్ మెడపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. దీంతో... అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పోందుతూ గావిన్ మృతిచెందాడు. ఈ నేపథ్యంలో... నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండియానాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.