ఫోటో స్టోరి: రబ్బరులో చిక్కుకున్న ప్లాస్టిక్ బొమ్మ
తనదైన అందం చురుకుదనంతో కవ్వించిన ఈ బ్యూటీకి లైగర్ ఫ్లాపవ్వడం పెద్ద మైనస్ అయింది.
లైగర్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది అనన్య పాండే. తనదైన అందం చురుకుదనంతో కవ్వించిన ఈ బ్యూటీకి లైగర్ ఫ్లాపవ్వడం పెద్ద మైనస్ అయింది. ఆ తర్వాత అనన్య తెలుగు సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన లేటెస్ట్ మూవీ డ్రీమ్ గర్ల్ 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
డ్రీమ్ గర్ల్ 2 ట్రైలర్ సహా ప్రతిదీ అభిమానుల్లో అంచనాల్ని పెంచాయి.ఆయుష్మాన్ ఖురానా ఈ చిత్రంలో కథానాయకుడు. అనన్య ప్రతిభావంతుడైన ఆయుష్మాన్ తో కలిసి భారీ బ్లాక్ బస్టర్ ని అందుకోబోతోందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రచారం పరంగా అనన్య ఎక్కడా తగ్గడం లేదు. ఇన్ స్టా ట్విట్టర్ సహా డిజిటల్ మీడియాల్లో చాటింగ్ సెషన్లు లైవ్ సెషన్లతో ప్రచారం హోరెత్తిస్తోంది. ఇక డ్రీమ్ గర్ల్ 2 లాంటి ప్రయోగాత్మక చిత్రంలో తన పాత్రకు చక్కని ప్రాధాన్యత ఉందని అనన్య చెబుతోంది.
మరోవైపు అనన్య వరుస ఫోటోషూట్లు అంతర్జాలంలో మంట పెడుతున్నాయ్. తాజాగా అందమైన లెదర్ ప్యాంట్ లెదర్ టాప్ ధరించి అనన్య అదరగొట్టింది. చిలుకాకు పచ్చ డిజైనర్ లెదర్ ఫ్యాంట్ మిరుమిటలు గొలుపుతూ షైనీ లుక్ తో ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ బాటమ్కి తగ్గట్టుగానే ఆకుపచ్చ రంగు బ్రాలెట్ తో ఎంతో హాట్ గా కనిపిస్తోంది. ఇక ఎంపిక చేసిన లెదర్ ఫ్యాంటుకి కాంబినేషన్ గా బ్లాక్ హీల్స్ ని అనన్య ధరించింది. గ్రీన్ వర్సెస్ రెడ్ లిప్స్టిక్ కాంబినేషన్ మతులు చెడగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఒక అభిమాని రబ్బరు దుస్తుల్లో ప్లాస్టిక్ బొమ్మ అంటూ కామెంట్ చేసాడు.