వీడియో: బర్త్ డే పార్టీలో మలైకా భగభగలు
బాలీవుడ్ హాట్ గాళ్ మలైకా సోమవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొత్త విషయం బయటపెట్టింది.
బాలీవుడ్ హాట్ గాళ్ మలైకా సోమవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొత్త విషయం బయటపెట్టింది. తనకు 48 ఏళ్లు నిండిన సందర్భంగా సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేసింది.. ఇప్పుడు తన బి-డే వేడుకల ప్రత్యేకతల్ని వివరించే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియోను పరిశీలిస్తే.. మలైకా దుబాయ్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. మల్లా ఒక విలాసవంతమైన హోటల్ సూట్లోకి ప్రవేశించింది. పర్షియన్ గల్ఫ్ సుందరమైన దృశ్యాన్ని ఆస్వాధిస్తూ, పూల్ దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఈ స్పెషల్ డే అంతా గడిపింది. ముఖ్యంగా బర్త్ డే బేబి మలైకా స్టైలిష్ బ్రాలెట్.. వెడల్పాటి లెగ్గింగ్ ప్యాంటు చూపరుల కళ్లు తిప్పుకోనివ్వలేదంటే అతిశయోక్తి కాదు.
దీనికి జతగా భారీ సన్ గ్లాసెస్ ధరించి అద్భుతంగా కనిపించింది. మంచి ఆహారం లేకుండా పుట్టినరోజులు జరుపుకోవడం కుదురుతుందా? అందుకే మలైకా అవకాడో ట్రీట్ సహా రుచికరమైన వంటకాల సేవనంలో మునిగిపోయింది. తన గాళ్స్ గ్యాంగ్ తో దుబాయ్‌లో వాలిపోయిన మలైకా లైఫ్ ని తనకు నచ్చినట్టు ఎంజాయ్ చేసింది. మలైకా కేక్ కటింగ్ వేడుక లో పసుపు రంగు బ్రాలెట్ .. మ్యాచింగ్ మ్యాక్సీ స్కర్ట్‌లో హాట్ గా కనిపించింది.
సోమవారం తన పుట్టినరోజు వేడుకల నుండి ఫోటోల బంచ్‌ను షేర్ చేస్తూ మలైకా ఇలా రాసింది. ``సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు నాకు 48 ఏళ్లు వచ్చేసరికి, నాకు ఇష్టమైన బాత్‌రోబ్‌లో శాంతికి, నా ప్రశాంతతకు కృతజ్ఞురాలిని. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉంది. ఇక్కడ కూర్చున్నప్పుడు, ప్రతి క్షణం సున్నితమైన గుసగుసలా అనిపిస్తుంది. నన్ను స్వీయ-ఆవిష్కరణ అంతర్గత బలం వైపు నడిపిస్తుంది. ఇక్కడ గాలి ఓదార్పు గుసగుసలు, కొత్త ప్రారంభాల వాగ్దానాన్ని ప్రతిబింబించే మంత్రముగ్ధులను చేసే సూర్యాస్తమయాలు..నా జీవితాన్ని అందంగా మార్చిన వ్యక్తుల వెచ్చదనం.. ఇప్పటివరకు ఈ జీవితానికి కృతజ్ఞతలు. భవిష్యత్ జీవితం విషయంలో ఆశాజనకంగా ఉన్నాను. నాకు జన్మదిన శుభాకాంక్షలు!.. అని తెలిపింది.
స్నేహితుడు అర్జున్ కపూర్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన సోషల్ హ్యాండిల్ లో హృదయపూర్వక నోట్‌ను రాశారు. దీనిపై మలైకా అరోరా కూడా స్పందించింది. అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఇలా రాశాడు. హ్యాపీ బర్త్‌డే బేబీ !!! ఈ ఫోటో మీ చిరునవ్వు, ఆనందం, లైట్నింగ్ని తీసుకువస్తారు. గందరగోళంలో కూడా నేను ఎల్లప్పుడూ మీ వెన్నుదన్నుగా ఉంటాను… అని వ్యాఖ్యను జోడించాడు. ఇటీవల మలైకా అరోరాఖాన్- అర్జున్ కపూర్ జంట విడిపోయారు అంటూ ప్రచారం సాగింది. కానీ అది నిజం కాదని పదే పదే ఈ జోడీ తమ చర్యల ద్వారా నిరూపిస్తోంది.