ఫోటో స్టోరి: చీరలో రతిరాణి హొయలు
చీర అందాన్ని ఆరాధించనిది ఎవరు? అందమైన చీరలో లలనామణి సొగసును వర్ణించేందుకు కవి కాని వారు కూడా కాళిదాసు అవుతారు.
చీర అందాన్ని ఆరాధించనిది ఎవరు? అందమైన చీరలో లలనామణి సొగసును వర్ణించేందుకు కవి కాని వారు కూడా కాళిదాసు అవుతారు. ఇప్పుడు చీరకట్టులో హిమచల్ బ్యూటీ రుహానీని చూసిన అభిమానులు కవులు అయిపోతున్నారు. కవితలు అల్లేస్తున్నారు. ప్లెయిన్ శారీ డిజైనర్ రవికెలో ఎంతో అందంగా కనిపిస్తున్న రుహానీ స్మోకీ కళ్లతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. అంత అందమైన రుహానీ శర్మ టాలీవుడ్ సహా పంజాబీ చిత్రాలతో సుపరిచితురాలు.
ఈ బ్యూటీ తెలుగు చలనచిత్ర సీమలో వరుస అవకాశాలు అందుకుంది. చి.ల.సౌ చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశించింది. సుశాంత్ సరసన ఆరంగేట్ర నటిగా చక్కని ఆహార్యంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత `డర్టీ హరి` లాంటి బోల్డ్ మూవీతో మరింత పాపులారిటీ పెంచుకుంది. ఎం.ఎస్.రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అటుపై విశ్వక్ సరసన `హిట్ - ది ఫస్ట్ కేస్` చిత్రంలోనూ నటించి మెప్పించింది. అటు తమిళంలోనూ అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తోంది. తాజాగా చీరకట్టులో తన అబ్సెషన్ గురించి ప్రస్థావిస్తూ అందమైన ఫోటోలను ఈ బ్యూటీ షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.
చీరలో రహానీ ఎంతో అందంగా ఉంది అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. చాలామంది లవ్ , రెడ్ హార్ట్ ఈమోజీలను షేర్ చేస్తున్నారు. చీరలో రుహానీ సమ్మోహన రూపం హృదయాన్ని గాయపరిచిందంటూ పలువురు కుర్రాళ్లు వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. రుహానీ మునుపటితో పోలిస్తే ఎంతో అందంగా కనిపిస్తోంది ఈ ఫోటోగ్రాఫ్ లో. పక్కింటి అమ్మాయిగా నటిస్తూనే గ్లామరస్ పాత్రలకు సరిపోయే లుక్ రుహానీ సొంతం. తన రూపానికి సెన్సిబిలిటీస్ కి తగ్గట్టే దర్శకులు మంచి పాత్రల్ని ఆఫర్ చేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రుహాని తదుపరి నటుడు నాని సోదరి దీప్తి దర్శకత్వం వహిస్తున్న `మీట్ క్యూట్` అనే సిరీస్ లో నటించింది. యోడ్లీ ఫిల్మ్స్ నిర్మిస్తున్న `ఆగ్రా` అనే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రాన్ని ఇంతకుముందు కేన్స్ లో ప్రీమియర్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. విక్టరీ వెంకటేష్ సైంధవ్ చిత్రంలోను రుహానీ నటిస్తోంది. సైంధవ్ లో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక కాగా, రుహానీ డా.రీను అనే పాత్రలో నటిస్తోంది. తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఈ భామ ఇరుగు పొరుగునా తన అదృష్టం పరీక్షించుకుంటోంది.