ప్రశాంతంగా ఉండే కెనడా దేశంలోనూ విద్వేషాలు పెచ్చరిల్లాయి. అమెరికా కంటే కూడా ఈ పీస్ ఫుల్ కంట్రీలో తాజాగా అలజడులు చెలరేగాయి. కెనడాలోని సస్కట్చేవాన్ ప్రావిన్స్‌లోని సమీపంలోని పట్టణంలో ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడికి దిగారు. విచ్చలవిడిగా రెచ్చిపోయారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు మైల్స్ మరియు డామియన్ శాండర్సన్‌గా గుర్తించారు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు ప్రాంతాల్లో ఈ ఇద్దరు దుండగులు విచ్చలవిడిగా తిరుగుతూ కత్తిపోట్లు చేశారని తెలిపారు. జేమ్స్ స్మిత్ క్రీ నేషన్‌తో సహా మొత్తం 13 ప్రాంతాల్లో కత్తిపోట్లు జరిగాయి. సస్కటూన్‌కు ఈశాన్యంగా ఉన్న వెల్డన్ గ్రామంలో పలువురిని పొడిచారు. నేరం చేసిన తర్వాత పారిపోతుండగా.. పట్టుకోవడానికి పోలీసులు శతవిధాలా వెతికారు. దాడి చేసిన వ్యక్తులు వాహనంలో పారిపోయారు.
బాధితులను ఇంకా గుర్తించలేదని.. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి పంపారు. ఆదివాసీలపై ఈ దాడికి గల కారణాలపై తమకు ఎలాంటి క్లూ లేదని పోలీసులు మీడియాకు తెలియజేశారు.
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సామూహిక కత్తిపోటును 'భయంకరమైన.. హృదయ విదారక ఘటనగా' పేర్కొన్నారు. కెనడా శాంతియుతమైన దేశం.
అయితే ఇటీవలి కాలంలో, దేశంలో సాధారణ స్థితికి భంగం కలిగించే కొన్ని నేర సంఘటనలు నివేదించబడ్డాయి. అమెరికాలో జరిగినట్టు ఇక్కడ కూడా అలజడులు చెలరేగడం అక్కడి ప్రవాసులను కలవరపాటుకు గురి చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.