గుంటూరులో 12 మంది డాక్టర్లను క్యారంటైన్ కి తరలింపు..!

Update: 2020-04-17 08:50 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో 24 గంటల్లో జరిగిన కరోనా  పరీక్షల్లో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 572 పాజిటివ్ కేసులకు గాను 35 మంది డిశ్చార్జ్ కాగా - 14 మంది మరణించారని తెలిపింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 523 అని ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో  కర్నూలు - గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా  కేసులు నమోదు అవుతున్నాయి అని తెలిపింది.   గుంటూరు జిల్లాలో 122 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా - నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో 124 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా ఇద్దరు మృతి చెందారు.

ఇక రాష్ట్రంలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న గుంటూరు జిల్లాలో  12 మంది డాక్టర్లను క్యారంటైన్ కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ  జ్వరాల  ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు - వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. మరి కొంత మంది కరోనా పరీక్షల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. అందులో అనుమానం ఉన్న 12 మంది డాక్టర్లను క్యారంటైన్ కేంద్రానికి తరలించారు. గుంటూరు లోని ఓ ప్రైవేటు లాడ్జీని క్వారంటైన్‌ కేంద్రంగా మార్చిన అధికారులు.. డాక్టర్లు - వైద్య సిబ్బందిని అక్కడికి తరలించారు.

అలాగే , ఇదే గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు ఒక మెడికో సహా ఇద్దరు ఆర్‌ ఎంపీలకు కరోనా సోకినట్టుగా అధికారులు తెలిపారు.  దీంతో ఇద్దరు ఆర్‌ ఎంపీల వద్ద వైద్యం చేయించుకున్న దాదాపు 190 మంది క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు.  రోజురోజుకి జిల్లాలో కరోనా పంజా విసురుతుండటంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇకపోతే ఏపీలో శ్రీకాకుళం - విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిగిలిన అన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Tags:    

Similar News