ఏపీలో వైరస్ విజృంభణ.. ఒక్కరోజే 186 కొత్త కేసులు

Update: 2020-06-13 09:30 GMT
ఏపీలో రోజురోజూకీ  వైరస్ విజృంభణ పెరిగిపోతుంది. రాష్ట్రంలో వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతూ పోతుంది తప్పా  ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,477 శాంపిల్స్ పరిశీలిస్తే 186మందికి  వైరస్ పాజిటివ్ ‌గా తేలినట్లు మీడియా బులిటెన్ ‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాల వారు 33 , విదేశాల నుంచి వచ్చిన ముగ్గురితో  కలిపి మొత్తం 222 కేసులు నమోదయ్యాయి.

తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన కేసులు 4588కు (మొత్తం 5636కు) చేరాయి. మరో 42మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1865కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లాలో 800కుపైగా కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 500కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2641మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 82మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణాజిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  

ఇదిలావుంటే.. విదేశాల నుంచి వచ్చినవారిలో 202 పాజిటివ్ కేసుల్లో 180 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1068 కేసులు నమోదు కాగా 546 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. ఈరోజు 51 మంది డిశ్చార్జి అయ్యారు.  పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.దీనితో ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహిస్తోంది.
Tags:    

Similar News