నోరు తెరిస్తే చాలు నీతులు చెప్పే అలవాటున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అడ్డంగా బుక్ అయ్యారా? నీతుల దారి నీతులదే.. చేసే పనులు చేసేవే అన్నట్లుగా ఆయన తీరు ఉందంటున్నారు. హైదరాబాద్ లోక్ సభ స్థానానికి తిరుగులేని రీతిలో ఎంపీగా విజయం సాధిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ మాష్టారికి.. హైదరాబాద్ ఎంపీ పరిధిలో రెండు ఓట్లు ఉన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
సాధారణంగా ఒక చోట ఓటు ఉన్నప్పుడు.. మరో చోట ఓటు తీసుకునే వీలు ఉండదు. అయితే.. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ పెద్దగా ఉండని నేపథ్యంలో వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నోళ్లు చాలామందే కనిపిస్తారు.
కొందరు తమ ఓటును వేరే ప్రాంతానికి తరలించే ప్రక్రియ చేపట్టిన వేళ.. దాని ప్రాసెస్ భారీగా ఉండటంతో పాటు.. దాని మార్పు కోసం నానా పాట్లు పడాల్సి రావటంతో.. కొత్తగా మారిన చోటుకు ఓటును బదిలీ చేసుకునే కన్నా.. పాత ఓటును అలా వదిలేసి.. కొత్తగా ఉండే చోట సరికొత్తగా ఓటు కోసం అప్లై చేసుకోవటం చాలామందిలో చూస్తుంటాం.
మజ్లిస్ అధినేత కూడా అలాంటి వారి లెక్కలోనే ఉన్నారా? అన్నది తేలాల్సి ఉంది.
తాజాగా ఓటరు జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో.. మజ్లిస్ అధినేత అసద్ కు రెండు చోట్ల ఓట్లు ఉండటాన్ని గుర్తించారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అసద్ కు ఒక ఓటు ఉండగా.. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో మరో ఓటును ఎన్నికల కమిషన్ కల్పించటం గమనార్హం. ఎంపీగా ఉండి కూడా రెండు చోట్ల ఓట్లను ఎలా పొందుతారని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్.
ఆధార్ తో ఓటును అనుసంధానం చేస్తే రెండు ఓట్లకు అవకాశం ఉండదని చెప్పిన నేపథ్యంలో.. తన ఓటును అసద్ ఆధార్ తో అనుసంధానం చేసుకోలేదా? లేదంటే.. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ లోపమా? అన్నది తేలాల్సి ఉంది. ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. సాదాసీదా ప్రజల మాటేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.