విశాఖ‌లో తుపాకుల మోత‌.. భారీ ఎన్‌ కౌంట‌ర్‌..!

Update: 2019-09-22 15:56 GMT
ఏపీలోని విశాఖ జిల్లాలో భారీ ఎన్‌ కౌంట‌ర్ జ‌రిగింది. ఇందులో ఐదుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. పోలీసులకు న‌క్సల్స్‌ కు జ‌రిగిన కాల్పుల్లో మావోయిస్టులు భారీ మూల్య‌మే చెల్లించుకున్నారు. విశాఖ జిల్లాలో మ‌రోమారు తుపాకులు గ‌ర్జించ‌డం - ఇందులో మావోల‌కు పెద్ద ఎత్తున న‌ష్టం జరిగింది. పోలీసుల‌కు - మావోయిస్టులకు మ‌ధ్య భీక‌ర‌మైన కాల్పులు జర‌గ‌డం - ఇందులో ఐదురుగు మావోయిస్టులు మృతి చెంద‌డంతో విశాఖ జిల్లాలో రెడ్ అల‌ర్ట్ నెల‌కొంది. ఈ ఎన్‌ కౌంట‌ర్ మావోయిస్టు వారోత్స‌వాల స‌మ‌యంలోనే జ‌రుగ‌డం - అది కూడా మావోయిస్టుల‌కు ఎదురు దెబ్బగానే చెప్ప‌వ‌చ్చు.

విశాఖ జిల్లా జీకే వీధీ మండ‌లం మాదిన‌మ‌ల్లు అట‌వీ ప్రాంతంలో ఈ ఎన్‌ కౌంట‌ర్ జ‌రిగింది. విశాఖ జిల్లాలోని ధార‌కొండ ఏజెన్సీలో మావోయిస్టులు వారోత్స‌వాల‌కు సిద్ధం అయిన త‌రుణంలో ప‌క్కా స‌మాచారం మేర‌కు పోలీసులు అక్క‌డికి చేరుకుని కాల్పులు జ‌రుప‌డంతో ఐదుగురు మావోయిస్టులు మృత్య‌వాత ప‌డ్డారు. విశాఖలోని ధార‌కొండ ఏజెన్సీలో జ‌గిరిన ఈ ఎన్‌ కౌంట‌ర్‌ లో మావోయిస్టు కీల‌క‌నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. గ‌త కొంత‌కాలంగా విశాఖ జిల్లాలో మావోస్టుల కార్య‌క‌లాపాలు చాప‌కింద‌నీరులాగా సాగుతున్నాయ‌నే స‌మాచారం ఉన్న పోలీసులు క్ర‌మం త‌ప్ప‌కుండా కూంబింగ్ నిర్వ‌హిస్తూనే ఉన్నారు.

మావోయిస్టుల వారోత్స‌వాలు రావ‌డంతో మావోయిస్టులు సంతాప స‌భ‌లు - స‌మావేశాలు నిర్వ‌హించ‌డం అన‌వాయితీగా వ‌స్తుంది. అయితే ఇప్పుడు వారోత్స‌వాల సంద‌ర్భంగానే ఈ ఎన్‌ కౌంట‌ర్ జ‌రుగ‌డంతో విశాఖ జిల్లా ఒక్క‌సారే ఉలిక్కి ప‌డింది. ఏవోబీ స‌రిహద్ధులో ఉన్న ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు ను - మాజీ ఎమ్మెల్యే ను హ‌త‌మార్చారు మావోయిస్టులు. అప్ప‌టి నుంచి ఇక్క‌డ ఎలాంటి మావోయిస్టుల కార్య‌కలాపాలు లేకుండా పోయింది. ఇప్పుడు మావోయిస్టుల వారోత్స‌వాలు రావ‌డంతో మావోస్టులు స‌భల ఏర్పాటులో నిమ‌గ్న‌మైన త‌రుణంలో ఇలా ఓకేసారి పోలీసులు మావోయిస్టుల‌పై విరుచుకుప‌డి ఎన్‌ కౌంట‌ర్ చేయ‌డంతో ఐదుగురు మావోయిస్టులు అక్క‌డిక్క‌డే మృతి చెందారు.

అయితే ఇందులో కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు హ‌త్య‌లో కీల‌క పాత్ర‌దారిగా అనుమానిస్తున్న అరుణ ఉన్న‌ట్లు స‌మాచారం. 2015లో కొయ్యూరు ఎన్‌ కౌంటర్‌ లో పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత అజాద్‌ సోదరి అరుణ అలియాస్‌ వెంకట రవి చైతన్య ఈ ఎన్‌ కౌంట‌ర్‌ లో హ‌త‌మైన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఏదేమైనా గ‌త కొంత కాలంగా ప్ర‌శాంతంగా ఉన్న విశాఖ జిల్లాలోని ధార‌కొండ ఏజెన్సీ - ఓవోబీ ఎన్‌ కౌంట‌ర్‌ తో క‌ల్లోలం నెల‌కొంది. అయితే ఎన్‌ కౌంట‌ర్‌ ను పోలీసులు కూడా నిర్ధారించారు. ఇంకా ఎదురు కాల్పులు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం అందుతున్న‌ప్ప‌టికి మృతి చెందిన ఐదురుగు మావోయిస్టులేనా.. లేక ఇంకా ఎక్కువ ఉన్నారా ? తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News