ఏపీ కలల ప్రాజెక్ట్ పోలవరంపై కేంద్రం ట్విస్ట్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని 2017-18 ధరలకే ఖరారు చేసి జగన్ సర్కార్ కు షాకిచ్చింది.30వేల కోట్ల లోపు చాలు పోలవరం నిర్మాణానికి అంటూ ఇటీవల కేంద్రం చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపాయి. చంద్రబాబు హయాంలో సవరించిన అంచనాలతో 55వేల కోట్లుగా కేంద్రానికి నివేదిక పంపారు. కేంద్రం కూడా అప్పట్లో ఆమోద ముద్ర వేసింది.అయితే జగన్ సర్కార్ వచ్చాక 25వేల కోట్ల రూపాయలకు కొర్రీలు పెట్టింది. దీంతో ఏపీలో పెను దుమారం చెలరేగింది. చంద్రబాబు రాజీపడడం వల్లే కేంద్రం మెలిక పెట్టిందని వైసీపీ ఆరోపించింది.చంద్రబాబు అన్యాయం చేశారని ఆడిపోసుకుంది.
చివరకు ఇప్పుడు కేంద్రం అదే చంద్రబాబు ప్రతిపాదించిన రూ.55వేల కోట్ల ఫిగర్ కే ఓకే చెప్పడం గమనార్హం. కేంద్ర జలశక్తి శాఖ ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. పోలవరం ప్రాజెక్ట్ కోసం ఇప్పటిదాకా రూ. 17వేల కోట్లు ఖర్చు చేసినట్టు తాజా లెక్కలుచెబుతున్నాయి. మరి 55వేల కోట్ల ఖర్చు చేయడానికి ఎన్నేళ్లు పడుతుందనేది అంతుచిక్కడం లేదు.
కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ నిధుల వివరాలను తెలియజేసింది. 2017-18 ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి రూ. 55వేల 548.87 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదముద్ర వేసింది. 2020 ఏడాది పురోగతి నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. 2454 మీటర్ల ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం, 1128.4 మీటర్ల పొడవైన స్పిల్‌వేతో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ గోదావరి జిల్లాలు విశాఖ, కృష్ణాజిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్లకు సాగునీటితో పాటు ఇతర ప్రయోజనాలు కల్పించాలన్నది లక్ష్యమని మంత్రిత్వ శాఖ నివేదికలో తెలిపింది.
2017-18 నాటి ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు ఆమోదిత వ్యయం రూ. 55వేల 548.87 కోట్లు కాగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 8614.16 కోట్లకు పెరిగింది. అందులో రూ.1850 కోట్ల రూపాయలు ఈ ఏడాది జనవరి నుంచి విడుదల అయ్యాయని, దీనికి తోడు 2020-21 ఏడాదిలో రూ.2234 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపింది.
విచిత్రమేమిటంటే, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2013-14 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు మొత్తం ఖర్చును కేవలం 20,398 కోట్ల రూపాయలుగా మాత్రమే పెట్టింది. మిగిలిన మొత్తాన్ని రూ .3 వేల కోట్లు మాత్రమే విడుదల చేస్తామని చెప్పారు. పునరావాసం మరియు పునరావాసం కోసం ఖర్చు 28,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంటుంది. వాటిని విడుదలే చేయలేదు. ఇప్పుడు 55వేల కోట్లు అని అందులో సగం కూడా విడుదల చేస్తుందా? లేదా అన్నది డౌటుగా మారింది.