ప్రపంచాన్ని కరోనా కబళిస్తోంది. భారత దేశాన్ని చుట్టుముట్టింది. హైదరాబాద్ కు వచ్చేసింది. ఇంత దూరానా ఉన్న మనల్నే వదలని కరోనా.. చైనాకు దగ్గరలోని ఇరాన్ ను చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా బాధితులతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక కరోనా బాధితులు ఇరాన్ దేశంలో వెలుగుచూశారు. దాదాపు 2300మందికి కరోనా సోకిందని తేలింది.ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కరోనా సోకిన వారిలో 23మంది ఇరాన్ ఎంపీలు ఉండడం కలవరపరుస్తోంది.
తాజాగా ఇరాన్ దేశంలో 290మంది ఎంపీలకు పరీక్షలు చేయగా.. 23మందికి కరోనా వైరస్ సోకిందని తేలింది. ఈ వ్యాధి సోకిన వారిలో ఇరాన్ దేశ ఉపాధ్యక్షురాలు మసౌమె ఎబ్తేకర్ ఉండడం సంచలనమైంది.
ఇరాన్ ఉన్నతాధికారులకు కూడా కరోనా వైరస్ సోకింది. దేశ అధ్యక్షుడికి కూడా సోకిందని ప్రచారం సాగుతోంది. చైనా తర్వాత అత్యంత విజృంభిస్తున్నది ఇరాన్ దేశంలోనే.. గల్ఫ్ దేశాల్లో ఇది తీవ్ర రూపం దాలుస్తోంది. దాదాపు 80 దేశాలు కరోనా వైరస్ తో అల్లాడుతున్నాయి.