ప్రపంచంలో యంగెస్ట్ ఉగ్రవాది..వయసు 3 నెలలే

Update: 2017-04-17 07:43 GMT
షాక్ తినొద్దు.. 3 నెలల చిన్నారి ఉగ్రవాది కావడం ఏంటని కోపం తెచ్చుకోవద్దు. మనకు తెలుసు ఆ సంగత. కానీ, అమెరికా ఎంబసీ అధికారులకే మెదడు మోకాళ్లలోకి దిగజారి మూడు నెలల చిన్నారిపై ఉగ్రవాద ముద్ర వేశారు. అంతేకాదు... సరిగ్గా సైగలు చేయడం కూడా రాని ఆ చిన్నారిపై ప్రశ్నల వర్షం కురిపించారు.  ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారించారు.   
    
తమ మూడు నెలల చిన్నారి హార్వీ కెన్యాన్‌ తో కలిసి - హాలిడే ట్రిప్ కోసం బ్రిటన్ నుంచి యూఎస్ లోని ఫ్లోరిడా కు వెళ్లేందుకు అతని తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. బ్రిటన్ నుంచి   అమెరికా వెళ్లాలంటే నింపాల్సిన ఓ ఇమ్మిగ్రేషన్‌ ఫామ్‌ ను నింపే సమయంలో కన్యాన్ తాతయ్య పాల్ - ఓ చిన్న పొరపాటు చేశాడు. మీరు ఉగ్రకార్యకలాపాల్లో పాలు పంచుకున్నారా? అనే ప్రశ్నకు 'నో' అన్న చోట టిక్ చేయాల్సింది బదులు 'యస్' అన్న బాక్సులో టిక్ చేశాడు. అదే ఆ బిడ్డ పాలిట శాపమైంది. ఇది పొరపాటున జరిగి వుంటుందన్న కనీస విచక్షణ కూడా చూపని ఇమిగ్రేషన్ అధికారులు - హార్వీకి సమన్లు జారీ చేసి - లండన్‌ లోని దౌత్యకార్యాలయానికి పిలిపించారు. అక్కడ చిన్నారి నవ్వుతూ పడుకుంటే, విచారించే ప్రయత్నం చేశారు. అతని నఖశిఖపర్యంతం పరీక్షించారు. వారు పరీక్షిస్తుంటే ఆ చిన్నారి మాత్రం తన లోకంలో తానున్నాడు.
    
కాగా అమెరికా ఎంబసీ అధికారుల తీరును విమర్శిస్తే ఇంటర్నేషనల్ మీడియా ఏకిపడేసింది. గార్డియన్ వంటి పత్రికలు ఏకిపడేశాయి.  ఈ ఘటనతో ఫ్లోరిడా విమానాన్ని మిస్ చేసుకున్న ఆ కుటుంబం మరో విమానంలో వెళ్లాల్సి వచ్చింది. అయినా అమెరికా అధికారుల పిచ్చి కానీ, నిజంగానే ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్నవాడైనా సరే ‘‘నేను ఉగ్రవాదినోచ్’’ అని చెప్పేస్తాడా ఏంటి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News