ఎన్నో ఆశలతో అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని ఆశించిన భారతీయ విద్యార్థులకు చివరకు నిరాశే మిగిలింది. విద్యార్థుల ఆశలపై అమెరికా నీళ్లు చల్లించింది. అమెరికాలో నకిలీ యూనివర్సిటీలను అరికట్టడంలో విఫలమైన అక్కడి ప్రభుత్వం భారతీయ విద్యార్థులపట్ల కర్కశంగా వ్యవహరించింది. అమెరికా అనుభవం విద్యార్థులకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.
అమెరికాకు చెందిన నకిలీ యూనివర్సీటీలో అడ్మిషన్ పొందిన పాపానికి భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పడరానిపాట్లు పడ్డారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులను అమెరికా నిర్బంధించింది. అంతటితో ఆగకుండా అక్కడి పోలీసులు వారిని తప్పుచేసిన దొంగల్లా వారిని చూడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తారు. మోసపోయిన విద్యార్థులకు అండగా నిలువాల్సిన అమెరికా వారిపట్ల కర్కశంగా ప్రవర్తించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో అమెరికా కొంతమేరకు వెనక్కి తగ్గింది.
అమెరికాలోని భారత విదేశాంగ కార్యాలయం, తెలుగు సంఘాలు విద్యార్థులను విడిపించేందుకు చొరవ తీసుకున్నారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన 30మంది విద్యార్థులు హైదరాబాద్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి వారి సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. పలువురు విద్యార్థులు ఈ సంఘటనపై మాట్లాడుతూ అమెరికా వెళ్లినందుకు తమకు చేదు అనుభవం ఎదురైందని వాపోయారు. అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనుకున్న తమ ఆశలు అక్కడి నకిలీ యూనివర్సీటీలు తమను నిలువనా ముంచాయన్నారు. అమెరికా నకిలీ యూనివర్సీటీలపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఇంకా అక్కడే మిగిలిన విద్యార్థులకు కూడా రప్పించేందుకు విదేశాంగ శాఖ, అమెరికాలోని తెలుగు సంఘాలు చొరవ తీసుకుంటున్నాయి. విద్యార్థులు దూరపు కొండలు నునుపు అన్న చందంగా విద్యార్థులు ఎక్కడోకో వెళ్లకుండా ఇక్కడే ఉన్నత చదువు చదివి దేశానికి సేవ చేయాలని పలువురు హితవు పలుకుతున్నారు.