కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్‌ని చంపేందుకు ప్రపంచవ్యాప్తంగా 70 రకాల వ్యాక్సిన్లు తయారవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పింది. ఈ 70లో మూడు వ్యాక్సిన్లను ముగ్గురు వ్యక్తులపై ప్రయోగిస్తున్నారు అని తెలిపింది. . ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనది ఏదంటే… కరోనా వ్యాక్సినే. కానీ , ఇంకా ఇది తరయారు కాలేదు. ఈ వ్యాక్సిన్ తయారీలో 70 ఫార్మా కంపెనీలు - సంస్థలు పోటీ పడుతున్నాయి. వీటిలో ఏదో ఒకటి సక్సెస్ అయినా చాలు... కరోనాకి అంతం మొదలైనట్టే.
హాంకాంగ్ కి చెందిన కాన్సినో బయోలాజిక్స్ - చైనా బీజింగ్ కి చెందిన బీజింగ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ కలిసి ఓ వ్యాక్సిన్ తయారుచేశాయి. దాన్ని మనుషులపై ప్రయోగిస్తున్నాయి. ఈ ప్రయోగాలు తొలి దశ ముగిసి... రెండో దశకు చేరాయి. అమెరికాకు చెందిన ఇనోవియో ఫార్మాస్యూటికల్స్ తోపాటూ... మరో కంపెనీ కూడా...మనుషులపై తమ వ్యాక్సిన్లను ప్రయోగిస్తున్నాయి. సాధారణంగా ఓ వ్యాక్సిన్ తయారు చెయ్యడానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. కరోనా వ్యాక్సిన్ మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రపంచమంతా చేరుకునేలా ప్లాన్స్ వేస్తున్నారు. ఫార్మా రంగంలో దిగ్గజాలైన Pfizer Inc., Sanofi కంపెనీలు చేస్తున్న వ్యాక్సిన్లు ప్రస్తుతం ప్రి-క్లినికల్ స్టేజ్ లో ఉన్నట్లు WHO తెలిపింది.
ఇక కేంబ్రిడ్జి... మసాచుసెట్స్ లో ఉన్న మోడెర్నా కంపెనీ ఇదివరకు ఇలాంటి ఉత్పత్తులు ఏవీ చెయ్యకపోయినా, ఇప్పుడు మాత్రం మార్చిలో మనుషులపై ట్రయల్స్ చేసేందుకు అనుమతులు పొందింది. సాధారమంగా వ్యాక్సిన్ ను కొన్నేళ్లపాటూ ముందుగా జంతువులపై పరీక్షిస్తారు. ఈ రూల్ అభివృద్ధి చెందుతున్న ఇండియా లాంటి దేశాల్లో ఉంది. కానీ మోడెర్నాకి ఇచ్చిన అనుమతుల్లో జంతువులపై మానేసి... డైరెక్టుగా మనుషులపై ప్రయోగాలు చేసేందుకు అనుమతి ఇచ్చేశారు.