అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారా..? ఆయనను కిడ్నాప్ చేసి చంపేయాలనుకున్నారా..? ట్రంప్ పై ఎవరికి కోపం వచ్చింది..? ఆయన వయసెంత..? అనే ప్రశ్నలకు సమాధానాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్సుడు ట్రంప్ పై దాడి చేస్తానని ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా తన పేరు చెప్పి మరీ న్యూయార్క్ నగరంలోని సీక్రెట్ సర్వీస్ డెస్క్ కు ఫోన్ చేశాడు. అంతేకాకుండా ఐలాండ్ లోని సీక్రెట్ సర్వీస్ కార్యాలయానికి రెండు వాయిస్ మెసేజ్ లు కూడా పంపాడు. దీంతో ఆ వ్యక్తిని ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే సొంత పూచికత్తుతో అతడు విడుదలయ్యాడు.
థామస్ వెల్నిక్ అనే 72 ఏళ్ల వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను కిడ్నాప్ చేస్తానని బెదరించాడు. గత ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన తరువాత అనేక ఆసక్తికర పరిణమాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల్లో తాను ఓటమి చెందలేదని వైట్ హౌజ్ ను వీడేందుకు ట్రంప్ నిరాకరించాడు. అయితే చివరికి ట్రంప్ తన ఓటమిని అంగీకరించాడు. అయితే అప్పటి నుంచి ట్రంప్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజుల తరువాత యూఎస్ కాపిటల్ పోలీసులు చేసిన విచారణలో ఈ విషయం బయటపడింది.
2020 ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తరువాత రాజీనామా చేయాలని, లేకపోతే కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈమేరకు నవంబర్ నెలలో ఓ వాయిస్ మెసేజ్ న్యూయార్క్ లోని సీక్రెట్ సర్వీస్ డెస్క్ కి తన సెల్ ఫోన్ నుండి మూడుసార్లు కాల్ చేశారని, ప్రతీసారి తన పేరు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా ఆయనను ఫెడరల్ కోర్టు సోమవారం విచారించింది. థామస్ కావాలనే ఈ పని చేశాడని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి బ్రాక్లిన్ తెలిపారు. థామస్ వెల్నిక్ వద్ద 22 క్యాలిబర్ తుపాకీ ఉందని అన్నారు.
అయితే వెల్నిక్ కు ఫెడరల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.3 లక్షల సొంత పూచీకత్తుతో అంగీకరించింది. అయితే అతన్ని ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపింది. రాత్రిపూట గృహనిర్బంధం చేయాలని, జీపీఎస్ మానిటరింగ్ పరికరాన్ని అమర్చాలని బ్రూక్లిన్ ఆదేశించారు. అతని మానసిక పరిస్థితిని గమనించాలన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకోకుండా అలర్ట్ చేయాలన్నారు.