ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం కొత్తగా ఏకంగా 75 కేసులు నమోదైనట్టు తాజా బులిటెన్ లో తెలియజేశారు. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 722కు చేరింది. 20 మంది ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయారు. దీంతో ఏపీలో కరోనా డేంజర్ బెల్ మోగించినట్టే తెలుస్తోంది.
ఏపీలో ఈరోజు నమోదైన 75 కేసుల్లో జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లాలో 25, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 4, కడప జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
ఇక అత్యధికంగా ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 174 కేసులు నమోదయ్యాయి. ఏపీలోని అన్ని జిల్లాలకంటే ఇదే అత్యధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారే ఇందులో ఎక్కువమంది ఉన్నారు.