దిశ చట్టం కోసం 87 కోట్లు విడుదల ...ప్రతి బస్ స్టాప్ లోమహిళా ఎస్సై, కంట్రోల్ రూమ్ !
ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఆడవారి పై జరిగే దారుణాలని అరికట్టడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని తీసుకొచ్చిన చట్టం దిశ చట్టం. ఇటు వంటి చట్టం దేశంలో తొలిసారిగా ఏపీ అమల్లోకి తెచ్చి చూపించింది. ఈ చట్టం పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో దిశ చట్టంను ఆమోదించారు. ఈ చట్టం ను తాము అమలు చేస్తామంటూ ఢిల్లీ..ఒడిశా ప్రభుత్వాలు ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ..చట్టం చేసిన వివరాలను పంపాలని కోరారు.
ఇకపోతే తాజాగా ఈ చట్టం పై ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన దిశ చట్టం అమల్లోకి తెస్తూ..ప్రభుత్వం ఆ దిశగా నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ 87 కోట్లు నిధులను రాష్ట్రం లో మహిళా పోలీసుస్టేషన్ల ఉన్నతీకరణ, ఫోరెన్సిక్ ప్రయోగశాలల బలోపేతం... ప్రతి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు.. దిశ కాల్‌సెంటర్.. యాప్‌ల కోసం వినియోగించనున్నారు. అదే విధంగా.. విశాఖపట్నం, తిరుపతి ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ, సైబర్ విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాల లోని డీఎన్ఏ , సైబర్ విభాగాల్ని మరింత పటిష్ఠం చేయనున్నారు. ఇక నుండి..డయల్ 100, 112లకు సంబంధించి ఒకే కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి దాన్ని దిశ కంట్రోల్ రూంగా పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దిశ యాప్ కోసం కోటి 26 లక్షల రూపాయలను వినియోగించనున్నట్లు ఉత్తర్వు ల్లో స్పష్టం చేసారు. రాష్ట్రంలో కొత్తగా ప్రతి బస్‌స్టాప్ సెంటర్ కు ఒక మహిళా ఎస్సై పోస్టు మంజూరు చేశారు. దీని ద్వారా ఆ పరిధి లో యువతులను ఈవ్ టీజింగ్..వేధింపులు..బస్సుల్లో ఆకతాయిలను నిరోధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక, దిశ ప్రత్యేక కేసుల విచారణ సందర్భంగా అదనపు విధులు నిర్వర్తించే మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది కి 30 శాతం ప్రత్యేక భత్యం చెల్లించనున్నారు. చట్టంలో తెలిపిన విధంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి..సరైన ఆధారాలు ఉంటే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక అనుమతులిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీచేశారు.