నగ్న వీడియో తీసి బంగారం, డైమండ్లు, డబ్బు కోసం 12 ఏళ్ల బాలికకు బెదిరింపు
ఓ వ్యాపారి 12 ఏళ్ల కుమార్తెతో స్నేహం చేసి భారీగా డబ్బులు వసూలు చేసిన యువకుడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఆమె నగ్న చిత్రాలను సెల్ ఫోన్ లో తీసి మైనర్ బాలికను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారని, ఆమె భయంతో వారి డిమాండ్‌లను తీర్చడానికి ఆమె ఇంట్లో బంగారు ,వజ్రాల ఆభరణాలతో పాటు ₹5 లక్షలు దొంగిలించిందని తేలింది.
దీంతో కుటుంబ సభ్యులు దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. పోలీసు అధికారులు 12 ఏళ్ల బాలికను కూడా విచారించారు, కాని ఏదీ తెరపైకి రాలేదు.
అయితే పోలీసు అధికారులు ఆమెను కూల్ పరిచి విషయాన్ని రాబట్టారు. విశ్వాసం కల్పించి అసలేం జరిగిందన్నది ఆరాతీశారు. దీంతో వారి ఇంట్లో నగదు , నగలు తానే దొంగిలించినట్టు ఆమె అంగీకరించింది.
"ఆమె తనను అమన్ ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో వివరించింది. ఒకసారి గదిలోకి లాక్కెళ్లిపోయాడని.. మరింత డబ్బు తీసుకురాకపోతే ఆమె ఫోటోలు మరియు వీడియోలను పబ్లిక్ చేస్తానని ఎలా బెదిరించాడో వెల్లడించింది" అని పోలీసు అధికారి చెప్పారు.
ఆమె వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితులపై దోపిడీ, కిడ్నాప్ మరియు లైంగిక వేధింపులకు పాల్పడినందుకు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం, 2012లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. నిందితుడిపై తమ వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే అతడిని కనిపెట్టగలమని పోలీస్ అధికారులు తెలిపారు.