ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. భోజనం చేయకుండా అయినా ఉంటున్నారు కానీ , మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి మళ్లీ పడుకునే సమయం వరకు ఆ మొబైల్ తో నే గడిపేస్తున్నారు. చిన్నా , పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు మొబైల్ కి , సోషల్ మీడియా కి , ఆన్లైన్ గేమ్స్ కి బాగా అడిక్ట్ అయిపోయారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆన్ లైన్ గేమ్స్ బాగా దగ్గరైయ్యారు. చదువు ..తినడం కూడా మానేసి సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు విద్యార్థులు. అయితే , అలా చేస్తున్న సమయంలో ఆన్లైన్ లో గేమ్స్ ఆడనివ్వకుండా తల్లిదండ్రులు అడ్డుకున్నారనే నెపంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది, ముఖ్యంగా పబ్ జి గేమ్ వచ్చాక ఆ ఆన్లైన్ గేమ్స్ పిచ్చి మరింతగా పెరిగిపోయింది.
అలాగే , ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎందుకు అని , కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే రోజురోజుకి కరోనా వైరస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. స్కూల్స్, కాలేజీలు ఇప్పట్లో తెరుచుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు ఇంట్లోనే ఆన్ లైన్ క్లాసులు వింటున్నారు. మరికొందరు టీవీలు, సెల్ ఫోన్లతో టైమ్ పాస్ చేస్తున్నారు. చాలామంది ఇంటి నుండి బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండటంతో చాలామంది పిల్లలు సెల్ ఫోన్ తో కాలక్షేపం చేస్తున్నారు. అలా వద్దు అని చెప్తే అప్పటికే బాగా సెల్ ఫోన్ కి అడిక్ట్ అవ్వడంతో కొంతమంది దేనికైనా తెగిస్తున్నారు. మరికొంతమంది మొబైల్ లో గేమ్స్ ఆడకుండా అడ్డుకుంటున్నారని ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఈ మద్యే చిత్తూరు జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా , ఆ తరువాత రెండు రోజుల క్రితం తెలంగాణలోని మంచిర్యాల లో తల్లి గేమ్ ఆడొద్దని మందలించింది అని, ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తాజాగా నేడు నెల్లూరు జిల్లా లో కూడా ఆన్ లైన్ గేమ్స్ కి మరో విద్యార్థి బలైపోయాడు. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. నెల్లూరు జిల్లాలోని పెద్దచెరుకూరు గ్రామానికి చెందిన ఓ దంపతుల కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే .ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా స్కూల్ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ మొబైల్ కి బాగా అలవాటు పడ్డాడు. ఇంట్లోనే ఖాళీగా ఉండటంతో రోజంతా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. అలా స్మార్ట్ ఫోనుకు బాగా అలవాటు పడిన ఆ బాలు అదే పనిగా ఎం,ఓబిలే లో గేమ్స్ ఆడుతుండేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రోజున కూడా ఎప్పటిలానే ఫోన్ కావాలని తల్లిని అడిగాడు. అయితే, ఆమె మొబైల్ ఫోన్ ఇవ్వకుండా , ఆన్లైన్ లో గేమ్స్ ఆడకూడదు అని బాలుడ్నికొంచెం మందలించింది. ఇక ఇప్పటినుండి ఫోన్ ఇచ్చేది లేదు అని , నోరు మూసుకొని బుక్స్ ఓపెన్ చేసి చదువుకోమని చెప్పి పనిమీద బయటకు వెళ్లింది. అయితే , గత కొన్ని రోజులుగా మొబైల్ కి బాగా అడిక్ట్ అవ్వడంతో అమ్మ ఫోన్ ఇవ్వలేదని మనస్తాపంతో చీరతో రేకులకు ఉన్న ఇనుప గొట్టానికి ఉరి వేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లి కుమారుడిని పిలవగా ఎటువంటి సమాధానం రాలేదు. కిటికీ నుంచి లోపలికి తొంగి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో స్థానికుల సహకారంతో తలుపులు పగులగొట్టి అతన్ని కిందకు దించారు. హుటాహుటినా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఈ మధ్య ప్రతి రోజు కూడా ఎక్కడో ఒక చోట పిల్లలు ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. కాబట్టి మొదటి నుండి ఈ విషయంలో పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలుగా మారకుండా జాగ్రత్తపడాలి, అలాగే ఇంట్లో ఖాళీగా ఉన్న పిల్లలు ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. తమ పనులకి అడ్డుపడకూడదు అని మొబైల్స్ వారికీ అలవాటు చేసి , ఆ తరువాత మొబైల్స్ చూడకూడదు చదువుకోండి అని మందలించడం చాలా తప్పు. మొదటగా తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి .. ఆ తరువాత పిల్లలని సరైన క్రమంలో పెంచాలి.