దుబాయ్ వెళ్లేందుకు గంజాయి రవాణా చేసి పట్టుబడ్డాడు..
గంజాయి రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తమకు అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు ఎక్కడికక్కడా తనిఖీలు నిర్వహించి గంజాయిని రవాణా చేసేవారిని పట్టుకుంటున్నారు. అయినా కొందరు రహస్యంగా, వివిధ మార్గాల ద్వారా దీనిని రవాణా చేస్తున్నారు.
అయితే కొందరు అధిక ధన సంపాదనే ధ్యేయంగా ఈ అక్రమాలకు పాల్పడుతున్నా.. పోలీసులకు దొరికిపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి డబ్బు అవసరం ఏర్పడి గంజాయి రవాణాణాను వృత్తిగా ఎంచుకున్నాడు. అయితే ఈ క్రమంలో అతను పోలీసులకు పట్టుబడడంతో ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లాడు.
ఈనెల 5న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 38 కిలోల గంజాయితో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అతనిని పోలీసులు విచారించిన తరువాత అసలు విషయం చెప్పాడు.
సికింద్రాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఒడిశా రాష్ట్రాం గణపతి జిల్లాకు చెందిన రాజీవ్ మాఝీ కూలీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో అధిక ఆదాయం కోసం దుబాయ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే దుబాయ్ వెళ్లడానికి ఓ ట్రావెల్ ఏజెంట్ ను కలవగా అతడు రూ.30 వేలు అవుతాయని తెలిపాడు. దీంతో ఆ 30 వేలను ఎలాగైనా సంపాదించాలనుకున్నాడు.
అయితే కష్టపడి కాకుండా ఈజీగా డబ్బు వచ్చే మార్గంపై ఆలోచించాడు. ఇంతలో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన సురేఖ లక్ష్మణ్ కాలే అనే మహిళ అతడికి పరిచయం అయింది.
తను డబ్బు తొందరగా సంపాదించాలంటే గంజాయి రవాణా చేయాలని చెప్పింది. దీంతో రాజీవ్ ఈనెల 5న 38 కిలోల గంజాయ్ తో ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ లో బయలు దేరావు. అయితే పోలీసులకు తాను గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో అతడు రైలు సికింద్రాబాద్ కురాగానే పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆ తరువాత రిమాండ్ కు పంపించారు.
తాను దుబాయ్ వెళ్లడం కోసమే ఈ పని చేశానని రాజీవ్ చెప్పినా అతడికి సురేఖ ఎలా పరిచయం అయింది..? అమెకు ఎక్కడి నుంచి గంజాయి రవాణా చేయాలని సూచించింది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు.
అయితే మొత్తంగా గంజాయి రవాణా చేసే వ్యక్తులే కాకుండా వాటి మూలాలను కూడా తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా ఇప్పటికే దేశంలో పలు చోట్ల భారీ ఎత్తున గంజాయి పట్టబడుతోంది. ఈ సందర్భంగా కొందరు డబ్బు సంపాదించుకోవడం కోస దీనిని ఎంచుకోవడం కలకలం రేపుతోంది.