పారిస్ లో నరమేధం వెనకున్న ప్రధాన సూత్రధారి సమాచారం ఆ దేశ భద్రతా దళాలకు తెలిసింది. బ్రసెల్స్ లో పుట్టిన అబ్దెస్లాం సలా ( 26) అనే వ్యక్తి ఈ దారుణానికి పన్నాగం పన్నాడని తేల్చారు. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తని, కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. కాగా, ఫ్రాన్స్ పై దాడి కుట్రంతా బెల్జియంలోనే జరిగిందని ఫ్రాన్స్ హోం మంత్రి తెలిపారు. దాడుల తరువాత ఇప్పటివరకూ ఏడుగురిని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేయగా, వారిలో ఒకరు సలా సోదరుడని తెలుస్తోంది.
కాగా పారిస్ లో మారణహోమాన్ని సృష్టించిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులపై పారిస్ సైన్యం దాడులకు దిగింది. సిరియాలో ఐఎస్ రాజధానిగా పేర్కొంటున్న రఖ్వాలోని ఐఎస్ శిబిరాలపై పారిస్ వైమానిక దాడులు చేసింది. పది బాంబర్ ఫైటర్లతో కూడిన 12 యుద్ధ విమానాలు రఖ్వాలోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసి బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో కమాండ్ పోస్టు - జిహాదీల రిక్రూట్ మెంట్ సెంటర్ - ఆయుధాల డిపోలు మొదటి లక్ష్యంగా ధ్వంసం చేసినట్లు పారిస్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జోర్డాన్ - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు అమెరికా సైనికుల సహకారంతో దాడులు చేస్తున్నారు.