జేసీ దివాకర్ రెడ్డి కి షాకిచ్చిన ఏసీబీ

Update: 2019-11-15 09:13 GMT
టీడీపీ మాజీ ఎంపీ, సీనియర్ సీమ నేత జేసీ దివాకర్ రెడ్డికి జలక్ ఇచ్చింది వైసీపీ సర్కారు. ఆయనకు ఎన్నో ఏళ్ల నుంచి పీఏగా చేసి ప్రస్తుతం వైదొలిగిన మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటి పై ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి.

సురేష్ రెడ్డి చాలా కాలంగా జేసీ దివాకర్ రెడ్డి పీఏ గా పని చేశారు. ప్రస్తుతం వైదొలిగిన ఆయన ఇంటిపై ఏసీబీ దాడులు శుక్రవారం కొనసాగుతున్నాయి. సోదాల్లో 3 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించినట్లు సమాచారం.

పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పని చేస్తున్న సురేష్ రెడ్డి.. చాలా కాలంగా డిప్యూటేషన్ పై జేసీ దివాకర్ రెడ్డి వద్ద పీఏగా పని చేశారు. అయితే జేసీ పదవి లో ఉన్నా లేకున్నా సురేష్ రెడ్డి సేవలు అందిస్తూ అధికారం చెలాయించడంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. జేసీ దివాకర్ రెడ్డిని అడ్డం పట్టుకొని ఏఈఈ సురేష్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలున్నాయి.

సురేష్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్ల పై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కోట్లాది రూపాయల ఆస్తులు బయట పడినట్లు తెలిసింది. జేసీ పీఏగా పనిచేసి కోట్లు కూడబెట్టి అధికారి పై ఏసీబీ దాడులు జరగడంతో  ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News